ఝాన్సీ లక్ష్మీబాయి వీర పరాక్రమం భరద్వాజరావినూతల కొత్తపట్నం జిల్లా -ప్రకాశం 9866203795
 ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
*************************** 
296) 
 ప్రముఖపాత్ర వహించిన వీరవనిత 
చరిత్రలో చాటుకుంది ఘనత 
తరతరాలు చెప్పుకుంటారు ఆమెకధ 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
297)
 మణికర్ణిక  అన్నది నిజనామం 
విద్యలలోబాల్యంలోనే  చూపింది  నైపుణ్యం 
యెనలేని దేశభక్తికి తార్కాణం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
298)
పుట్టింది బ్రాహ్మణ కుటుంబం 
చేసుకుంది గంగాధరుని వివాహం 
దామోదరుని దత్తునిగా స్వీకారం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!


******************************
299)
పరాయి పాలనపై తిరగబడ్డది 
గుర్రంపైనే చేసింది  పోరాటం 
భరతమాత దాస్యవిముక్తికి యుద్ధం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!

******************************
300)
మహిళైనా పట్టింది కత్తి 
అత్యంత ధైర్యసాహస వీరవనిత 
బెదిరింపులకు భయపడని ధీశాలి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!

కామెంట్‌లు