సాంబ శివుని అష్ట మూర్తులు:జలము రూపుడు - భవుఁడు! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 🙏శివా! భవుడవు నీవె!
     జలము రూపుడ వీవె!
     అష్ట మూర్తీ! శివా!
               ఓ సాంబ దేవ!
      ( సాంబ దేవ పదాలు., "శంకర ప్రియ." )
👌పరమేశ్వరుడు అష్టమూర్తు లలో..  "జలము" రూపము నందు విరాజిల్లు చున్నాడు. "భవ" నామము తో వ్యవహరింప బడు చున్నాడు.
🔱నమో భవాయ! మృడాయ!
    మహాకాలాయ! తే నమః!
    నమస్తే తోయ రూపాయ!
    శివాయ! గురవే నమః!
         ( శ్రీ శివ నవరత్న స్తోత్రం.,)
 👌"అమృత" శబ్దము నకు .. "జలము, అమృతము, మోక్షము".. అని, నానార్ధములు. "అమృత రూపు" డనగా.. అమృత తత్వమును అనుగ్రహించు అమృతాత్మకు డే సాంబ శివుడు, అని విశేషార్ధము!
👌"నార" మనగా జలము, నర సమూహము .. అని అర్థము. జలము స్థానముగా కలవాడు! నర సమూహము నకు స్థానమైన వాడు! ధర్మ స్థాపన కొరకు.. నర సంబంధ మైన  శరీర మందు అవతరించు వాడు. కనుక, నారాయణు డే ..పరమేశ్వరుడు!అని, విశేషార్ధము 
🙏"ఓం భవాయ, తోయ మూర్తయే నమః!" అని, వేద మాత.. పరమ శివుని ప్రస్తుతిoచినది.
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( మత్తేభం పద్యము)
        అమృతాకార! జగత్ పవిత్రకర! ప్రాణాధార! సృష్ట్యాది వే!
         భ్రమదూరా! "భవ!" ఓ త్రితాప హర! సర్వార్ద్రాoగ దీప్తీ! రసే

         శ! మహేశా! విషమైన లోగొని సుధాసారమ్ము నందించు దై
        వమ! "నారాయణ!" జీవ భావకర! తత్వా!  నీల కంఠేశ్వరా!
   
       (..శ్రీ నీల కంఠేశ్వర శతకము., బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ., )
   🙏ఓం నమః శివాయ! అష్ట మూర్తయే నమః!

కామెంట్‌లు