సాంబ శివుని అష్ట మూర్తులు:;-అగ్ని రూపుడు - "భవుఁడు"! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 🙏శివా! రుద్రుడ వీవె!
     అగ్ని రూపుడ వీవె!
     అష్ట మూర్తీ! శివా!
               ఓ సాంబ దేవ!
      ( సాంబ దేవ పదాలు., "శంకర ప్రియ." )
👌పరమేశ్వరుడు అష్టమూర్తు లలో..  "అగ్ని" రూపము నందు విరాజిల్లు చున్నాడు. "రుద్ర" నామము తో వ్యవహరింప బడు చున్నాడు.
🔱నమో రుద్రాయ! శాంతాయ!
    శివా ప్రియాయ! తే నమః!
    నమస్తే వహ్ని రూపాయ!
    శివాయ! గురవే నమః! 
         ( శ్రీ శివ నవరత్న స్తోత్రం.,)
 👌 ఐశ్వర్యమునకు మూలకారకుడు.. సాంబ శివుడు! సకల మానవాళికి.. "శ్రియము" అనగా సంపదలను అనుగ్రహించే వాడు, హుతాశనుడైన అగ్ని దేవుడు!
👌పరమేశ్వరుడు.. అగ్రము నందు వెలిగే జ్యోతి స్వరూపుడు! దివ్యమైన తేజస్సుల కెల్ల, తేజస్సు యైన పరంజ్యోతి!  అందరి హృదయములో ప్రకాశించే ఆత్మ చైతన్యమే.. సాంబశివ పరంబ్రహ్మ!
🙏"ఓం రుద్రాయ, అగ్ని మూర్తయే నమః!" అని, వేద మాత.. పరమ శివుని ప్రస్తుతిoచినది.
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( మత్తేభం పద్యము)
        రుద్రా! అగ్రము నoదు వెల్గు శుచిమ ద్రోచీ! జగద్రూప! సౌ
         భద్రాత్మా! బహు చిత్ర వర్ణకర! శోభా మూల సందీప్త! సం
         విద్రుపా! దనుజాoధ కాంతకర దీప్తీ! సర్వ భక్షా! సదా
         హృద్రాజా! వెలుగుల్ ఘటించుమ! మృడా!  నీల కంఠేశ్వరా!
   
       (..శ్రీ నీల కంఠేశ్వర శతకము., బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ., )
   🙏ఓం నమః శివాయ! అష్ట మూర్తయే నమః!

కామెంట్‌లు