సాంబ శివుని అష్ట మూర్తులు:వాయు రూపుడు - "ఉగ్రుడు"! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 🙏శివా! ఉగ్రుడ వీవె!
     వాయు రూపుడ వీవె!
     అష్ట మూర్తీ! శివా!
               ఓ సాంబ దేవ!
      ( సాంబ దేవ పదాలు., "శంకర ప్రియ." )
👌పరమేశ్వరుడు అష్టమూర్తు లలో..  "వాయు" రూపము నందు విరాజిల్లు చున్నాడు. "ఉగ్ర" నామము తో వ్యవహరింప బడు చున్నాడు.
🔱నమః ఉగ్రాయ! భర్గాయ!
    వామ దేవాయ! తే నమః!
    నమస్తే వాయు రూపాయ!
    శివాయ! గురవే నమః! 
         ( శ్రీ శివ నవరత్న స్తోత్రం.,)
 👌 పరిశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు.. సాంబ సదా శివుడు!   పావనము చేయు స్వభావము కలవాడు.. వాయు దేవుడు!
👌పరమేశ్వరుడు.. దేహమును చైతన్యము కలిగించు ప్రాణశక్తి స్వరూపుడు! సకల ప్రాణికోటికి ఆధారమైన వాడు.. వాయు దేవుడు. అంతటా వ్యాపించి యున్నవాడు.. సాంబ శివ పరంబ్రహ్మ!
🙏"ఓం ఉగ్రాయ, వాయు మూర్తయే నమః!" అని, వేద మాత.. పరమ శివుని ప్రస్తుతిoచినది.
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( శార్ధూలం పద్యము)
        ఉగ్రా! నీవను గాలి తాకిన మరే యొచ్చెమ్ము లైనన్
         అగ్రావాస! సుమంగళమ్ములగు నయ్యా! దేవా! ప్రాణాత్మకా!
         వ్యగ్రా! నిర్మల యోగగమ్య! బహు జీవాధార! చైతన్య సా
         రగ్రాహీ! శివ! సర్వగా! శ్రుతి విచారా!  నీల కంఠేశ్వరా!
   
       (..శ్రీ నీల కంఠేశ్వర శతకము., బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ., )
   🙏ఓం నమః శివాయ! అష్ట మూర్తయే నమః!

కామెంట్‌లు