సాంబ శివుని అష్ట మూర్తులు:సూర్య రూపుడు - "ఈశానుడు"! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 🙏ఈశానుడవు నీవె!
     సూర్య రూపుడ వీవె!
     అష్ట మూర్తీ! శివా!
               ఓ సాంబ దేవ!
      ( సాంబ దేవ పదాలు., "శంకర ప్రియ." )
👌పరమేశ్వరుడు అష్టమూర్తు లలో..  "సూర్యుని" రూపము నందు విరాజిల్లు చున్నాడు. "ఈశాన" నామము తో వ్యవహరింప బడు చున్నాడు.
🔱ఈశానాయ! వరదాయ!
    త్రి లోకేశాయ! తే నమః!
    నమస్తే సూర్య రూపాయ!
    శివాయ! గురవే నమః! 
         ( శ్రీ శివ నవరత్న స్తోత్రం.,)
 👌సాంబ శివుడు... సూర్య మండ లాంతర్వర్తి! త్రయీ మయుడు .. ఆదిత్యుడు! కనుక, మూడు వేదము లలో, ఋగ్వేదమును.. మండలము గాను; యజుర్వేదమును .. పురుషాకృతి గాను; సామవేదమును.. కిరణములు గాను; అభివర్ణించారు, మన మహర్షులు.
👌 పరమేశ్వరుడే.. నీల లోహితుడు. ఇందులో.. "నీల"వర్ణ శబ్దము -- సోమ ( జల) లక్షణమును; "లోహిత"వర్ణ శబ్దము --  అగ్ని లక్షణమును పేర్కొను చున్నాయి. కనుక, "అగ్నీ సోమాత్మకుడే".. ఆదిత్య రూపంలో నున్న సాంబ శివుడు!
🙏"ఓం ఈశానాయ,, సూర్య మూర్తయే నమః!" అని, వేద మాత.. పరమ శివుని ప్రస్తుతిoచినది.
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( శార్దూలము పద్యము)
        ఆదిత్యోజ్జ్వల మండలాంతర! విచిత్రానేక వర్ణాకృతీ!
         వేదాకార! వినీల లోహిత విభావిష్కార! ఈశాన! ఓ
         నాదాధారకరా! భిషగ్వర! జగన్నాథా! తమోధ్వoసి! వి
         శ్వాదీ! సర్వ రసమ్ములన్ గొనుమ! భవ్యా! నీల కంఠేశ్వరా!
   
       (..శ్రీ నీల కంఠేశ్వర శతకము., బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ., )
   🙏ఓం నమః శివాయ! అష్ట మూర్తయే నమః!

కామెంట్‌లు