సాంబ శివుని అష్ట మూర్తులు:జీవ రూపుడు - "పశుపతి"! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 🙏శివా! పశుపతి వీవె!
    జీవ రూపుడ వీవె!
    అష్ట మూర్తీ! శివా!
               ఓ సాంబ దేవ!
      ( సాంబ దేవ పదాలు., "శంకర ప్రియ." )
👌పరమేశ్వరుడు అష్టమూర్తు లలో..  "జీవుని" రూపము నందు విరాజిల్లు చున్నాడు. "పశుపతి" నామము తో వ్యవహరింప బడు చున్నాడు.
🔱నమస్తే! పశు పతయే!
   పార్వతీ పతయే నమః!
    నమస్తే ఆత్మ రూపాయ!
    శివాయ! గురవే నమః! 
         ( శ్రీ శివ నవరత్న స్తోత్రం.,)
 👌సాంబ శివుడు.. యజ్ఞేశ్వరుడు! ఈ విశ్వ కళ్యాణ మనెడు మహా యజ్ఞమునకు అధిష్టాన దైవమే పరమేశ్వరుడు!
👌 పరమేశ్వరు.. సమస్త ప్రాణి కోటి హృదయ క్షేత్రము లలో.. క్షేత్రజ్ఞునిగా,   ఆత్మ చైతన్య శక్తిగా, ప్రకాశించు చున్నాడు.. సాంబ శివుడు!
🙏"ఓం పశుపతయే,, యజమాన మూర్తయే నమః!" అని, వేద మాత.. పరమ శివుని ప్రస్తుతిoచినది.
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( శార్దూలము పద్యము)
        ప్రత్యక్షంబుగా అష్ట మూర్తిగ తిరంబై దోచు విశ్వాత్మకా!!
         నృత్యేశా! పశునాధా!  సాంబ! యజమానీ! దుష్క్రతు ధ్వంసకా!
        సత్యా! సర్వము యజ్ఞ మీ జగదధి ష్టానంబు వీవే! శివా!
     
         కృత్యాధార! ఫలoబు మోక్షమిడు సాక్షీ! నీల కంఠేశ్వరా!
   
       (..శ్రీ నీల కంఠేశ్వర శతకము., బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ., )
   🙏ఓం నమః శివాయ! అష్ట మూర్తయే నమః!

కామెంట్‌లు