శాంత రూపుడు - శివుడు! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 🙏శాంత రూపుడ వీవె!
    అభయం కరుడ వీవె!
    శంకర భగవాన్! శివ!
               ఓ సాంబ దేవ!
      ( సాంబ దేవ పదాలు., "శంకర ప్రియ." )
👌పరమేశ్వరుడు.. ప్రశాంతమైన స్వభావము కలవాడు. నిర్మల మైన వాడు. కనుక,  "ప్రశాంతాత్ము డని",  శివునకు పేరు!
🔱శాంతం పద్మాసనస్థం, శశిధర మకుటం, పంచ వక్త్రం త్రినేత్రం, ......
...... పార్వతీశం నమామి!
      ( ధ్యాన శ్లోకం., )
   🙏సాంబ శివుడు.. ప్రశాంతమైన  స్వరూపము తో; పద్మాసనము నందు ఆసీనుడై నాడు! బాల చంద్రుని "శిరో భూషణము"గా, జటా జూటము నందు దాల్చినాడు! ఆరాధకులు, మరియు  సాధకులకు అభయమును కలిగించు చున్నాడు అట్లే, భక్తుల యొక్క భయమును, భ్రాoతిని పోగొట్టు చున్నాడు!
🙏సద్యోజాతము, వామదేవము, అఘోరం, తత్పురుషం, ఈశానం.. యనెడు; అయిదు ముఖము లతో; మరియు  సూర్యుడు, చంద్రుడు, అగ్ని దేవుడు..... యనెడు, మూడు కన్ను లతో, ప్రకాశించు చున్నాడు; పార్వతీ దేవికి పతియైన పరమేశ్వరుడు; సాకారముగా.. భక్తు లందరికీ దర్శన మొసగు చున్నాడు
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( తేట గీతి )
        శాంత రూప! పద్మాసన! చంద్ర మకుట!
        పంచ వక్త్ర! త్రి లోచన! పార్వతీశ!
        స్ఫటికమణి నిభ! శుభకర! భవ భయహర!
     
         అభవ! అభివందనము శివ! సాంబ దేవ!
   
       ( "మధుర కవి" శ్రీ దేవుల పల్లి చెంచు సుబ్బయ్య శర్మ., )
   🙏ఓం నమః శివాయ! శివాయ నమః!

కామెంట్‌లు