శివాయ గురవే నమః! లింగ రూపుడు - శివుడు! "శంకర ప్రియ.," శీల., సంచార వాణి: 99127 67098
 🙏శివా కాంతుడ వీవె!
      లింగ రూపుడ వీవె!
      సర్వతో ముఖ! శివా!
               ఓ సాంబ దేవ!
      ( సాంబ దేవ పదాలు., "శంకర ప్రియ." )
👌సాంబ శివుడు.. మహా లింగోద్భవుడు! దివ్యమైన తేజో లింగ మూర్తిగా సాక్షాత్క రించాడు, బ్రహ్మ విష్ణ్వాది దేవతలకు. భూమండలము నకు.. ఆకాశము నకు మధ్యలో .. మనకు కనుపించు విశ్వమే.. "మహా శివ లింగ స్వరూపము"! కనుక, సర్వతో ముఖుడు.. పరమేశ్వరుడు.
🔱ధ్యాన శ్లోకము:
🙏దేవ దేవ! మహా దేవ!
     సాంబ దేవ! నమః శివా!
      మహా లింగ! శివా౭లింగ! 
       విశ్వ లింగ! నమః శివా!
   🙏లింగ మనగా చిహ్నము! అది.. సాంబ శివ పరం బ్రహ్మమును పేర్కొను చున్నది! అది.. శ్రేయస్సు, మంగళము.. మున్నగు వాటికి సంకేతమైనది. కనుక "శివ లింగ"మని పేరు! అది సత్యం.. శివము.. సుందరము!
 👌దేవతలు, దానవులు, మానవులు .. మున్నగు వారిచే సేవింప బడునది. కనుక "మహా లింగ" మని పేరు. అది.. శ్రీ శివ శక్తుల యొక్క స్వరూపమై; అంతటా వ్యాపించి యున్నది. ఆ విధంగా " దివ్య మహా లింగ మూర్తి" గా ఆవిర్భ వించిన, మహా దేవుడే .. సర్వేశ్వరుడు.. సాంబ శివుడు!
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( తేట గీతి )
        దివ్య సౌందర్య తేజ: ప్రదీప్త లింగ!
         అమల భక్తావళీ హృదయాబ్జ భృంగ!
        కాంత వర జటాజూట గంగా తరంగ!
     
         అభవ! అభివందనము శివ! సాంబ దేవ!
   
       ( "మధుర కవి" శ్రీ దేవుల పల్లి చెంచు సుబ్బయ్య శర్మ., )
   🙏ఓం నమః శివాయ! శివాయ నమః!

కామెంట్‌లు