సత్యమే తల్లి! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌సత్యమే తల్లియగు
      జ్ఞానమే తండ్రియగు
     మనకాత్మ బంధువులు!
           ఓ తెలుగు బాల!
      ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌సత్యము, జ్ఞానములు.. రెండు, తల్లి దండ్రులు వంటివి! అవి.. సచ్చిదానంద పరంబ్రహ్మము ధర్మములు!
👌ధర్మము, భూత దయ.. అనునవి, సోదరుడు, స్నేహితులు వంటివి! అవి, సంఘ ధర్మములు!
👌శాంతి, సహనములు.. భార్య, పుత్రులు వంటివి! అవి జీవ ధర్మములు! 
👌ఈ విధముగా, "సత్యము, జ్ఞానము, ధర్మము, దయ, శాంతి, సహనం... ఆరు సద్గుణములు".. మనకు ఆత్మ బంధువులు. అనగా, సమిష్టి కుటుంబ జీవనము నందు; మనకు ముఖ్యమైన బంధువర్గము!
          🚩నీతి పద్య రత్నం
          ( తేట గీతి )
       సత్యమే తల్లి, జ్ఞానమే జనకు డౌను,
       ధర్మమే సోదరుడు, భూత దయ సఖుడగు,
       శాంతియే భార్య, పుత్రుండు సహన మౌను;
        ఆరుగురు వీరు, బంధువులన నిజంబు!!
          ( నీతి గీతాలు., విద్వాన్ బులుసు వేంకటేశ్వరులు.,)

కామెంట్‌లు