-అంకెలు(బాలగేయం)--బొమ్ము విమలమల్కాజ్ గిరి 9989775161
ఒకటి రెండు అందామా
ఓపికతో ఉందామా
అంకెలనే నేర్చుకొని
లెక్కలనే చేయుదమా 

మూడు,నాల్గు అందామా
మురిపెమునే పొందుదమా
అంకెలనే నేర్చుకొని
జీవితాన్నె ఈదుదమా 

ఐదు,ఆరు అందామా
ఐరావతమెక్కుదమా
ఊరు,వాడ తిరిగేసి...
ఉల్లాసమె పొందెదమా 

ఏడు,ఎనిమిదందామా
ఏరువాకకెల్దామా
పంటల పండుగను జేసి...
పరువశించి పోదామా

తొమ్మిది పది అందామా
తోడునీడగుందామా
ఐకమత్యమే బలమని
మనం చాటి చెప్పుదమా 


కామెంట్‌లు