అప్రమత్తం ..!!> వచన కవిత ;-డా .కె.ఎల్.వి.ప్రసాద్> హన్మకొండ .

 ప్రకృతి 
మనం చెప్పినట్టు వినదు !
ప్రకృతి చెప్పినట్టు 
మనం వినకతప్పదు !
కారణంఏదైనా కావచ్చు 
ప్రకృతి విలయతాండవ,
వైపరీత్యాలతో ....సర్వం
అల్లకల్లోలం కావచ్చు....!
అది తుఫాను కావచ్చు
భయంకర.....
భూకంపం కావచ్చు....
ఉరకలెత్తించే 
ఉప్పెనకావచ్చు .....
ఉపద్రవాల రాకడను 
కనిపెట్టే శాస్త్ర పరిజ్ఞానం 
వెలుఁగులోకి రావాలి !
ప్రజలని అప్రమత్తం చేసే 
ప్రణాళికలు --
ప్రభుత్వాలు రూపొందించాలి !
ప్రజాలువాటిని ....
సద్వినియొగం చేసుకోవాలి !!
               ***
కామెంట్‌లు