.సొరకాయతో చిలుక;-డా:కందేపి రాణి ప్రసాద్

 చిన్నారులు! మీకు చిలుక శాస్త్రీయ నామం తెలుసా!
సిట్టా కస్ 'మీరు చిన్నప్పుడు, చిట్టి చిలకమ్మ! అమ్మ కొట్టిందా! పాటను పాడుకునే ఉంటారు.ఈరోజు ఆ చిట్టి చిలకమ్మను మనింటికి ఆహ్వానిద్దామా!
ఇంట్లో అమ్మ సొరకాయతో కూర వండేటప్పుడు ఓ సగం ముక్క పక్కకు పెట్టుకోండి చిలుక ముక్కు ఎర్రగా ఉంటుంది.కాబట్టి దానికోసం ఎర్రని క్యాప్సికమ్ తీసుకోవాలి.క్యాప్సికమ్ ను రెండు ముక్కలుగా కోసి,సొరకాయపై భాగాన ముక్కు వలె అమర్చి టూత్ ఫిక్స్ తో గుచ్చాలి.కళ్ళకోసం రెండు క్యారెట్ గుండ్రాలను తీసుకొని అగ్గిపుల్ల సహాయంతో 
గుచ్చాలి.చిలుక రెక్కలకు తోకకు కీరా వాడాలి. కిరాను తోలు తీయకుండా రెండు పలుచని ముక్కలుగా కత్తిరించి దాని కింద భాగాన చిలికలుగా కత్తిరించాలి.ఇవి రెక్కలన్నమాట రెండు రెక్కాలను చిలుకకు రెండు వైపులా గుండు సూదులతో గుచ్చాలి ఊడకుండా.తోక కోసం కిరలోని లోపలి భాగాన్ని తీసుకోవాలి.లోపలి భాగం తెల్లగా,స్మూత్ గా ఉంటుంది.కాబట్టి అందంగా ఉంటుంది.కిరాను పలుచగా పొడవుగా కత్తిరించి దాని చుట్టూరా
రంపపు పళ్ళవలె కత్తిరించి పెట్టుకోవాలి.ఇది పలుచగా ఉండటం వలన ఎటు కావాలంటే అటు వంగుతుంది.అలా ఉంటేనే నిజమైన తోకలా ,చిలుకను కదిల్చినప్పుడల్లా ఊగుతుంది.ఈ తోకను సొరకాయ వెనుక భాగాన గుచ్చాలి.ఇక చిలుకకు కాళ్ళు పెడితే బొమ్మ తయారయినట్లే.రెండు దొండకాయలను పలుచగా కత్తిరించి,చివర్లు చీలికలుగా చేయాలి.ఇవి కాళ్ళు,వేళ్ళు అన్నమాట.ఈరెండు కాళ్ళను సొరకాయకు అడుగు భాగాన గుండు సూదులతో గుచ్చాలి.ఆకుపచ్చని పట్టుచీర,ఎర్రని లిపీస్టిక్ వేసుకొని 'ఫ్యాషన్ షో ' కు సిద్దమైన అందాల చిలకమ్మ తయారైంది. ర్యాంప్ ఎక్కడో మీ ఇష్టం. 
కామెంట్‌లు