శీర్షిక: దీపావళి(బాల గేయం);-లతా శ్రీ-పుంగనూరు
చిచ్చురు బుడ్డలు
చిన్నారి మాటలు

కాకర పువ్వొత్తులు
పాపాయి నవ్వులు

భూ చక్రాల సందడులు
పిల్లల అల్లరి ఆటలు

వెన్నముద్ద వెలుగులు
పాప కంటి జిలుగులు

తీపి తీపి లడ్డూలు
బుడతడి మాటలు

ప్రతి ముంగిట విరియాలి
పసిడి దీప కాంతులు

నశించాలి చెడు ఆలోచనలు
వెలగాలి జ్ఞానజ్యోతులుకామెంట్‌లు