వలపుల దేవేరి;-సువర్ణ లాల్కొటా-కలం స్నేహం
నువ్వెక్కడుంటే అక్కడ జలపాతాల ఝరులే!
పారే సెలయెరులే!  ఘల్లుఘల్లున గజ్జెల సవ్వడితో 
గలగలా తిరుగుతూ నా మనసుని దోచిన నీతో 
ఓ గుప్పెడంత స్నేహం చేయాలని నా మది తహతహలాడింది!

ఓ సెల్ఫీ ప్లీజ్ అంటూ నీ వెంటబడి నిన్ను 
నా గుండెగూటిలో ప్రతిష్టించుకుని 
వలపులరాణిగా కొలుచుకుంటున్నా!!

ఏం మాయ చేసావో నా మనసంతా నిండిపోయావు! 
నాలో వలపుకుసుమాలు విరబూయించావు! 

నీవు లేని నా మది 
ఓ మౌనరాగం ఆలాపిస్తోంది!
నీవు పక్కనుంటే నాకు నేనే మహారాజును అనిపిస్తోంది!

నీ కొంటేకోణంగితనం నా ఎదలో గంటలు మ్రోగిస్తోంది!
నువ్వాడే దాగుడుమూతలు నన్ను దారితప్పేలా చేస్తున్నాయి!

నీ ఆటా,పాటా నాకు ఉషోదయపు కిరణాలే!
నీ నవ్వుంటే నాకు తిరణాల్లే!
ఇకపై నీవు నా దీవేరేలే!
అనుక్షణం ముద్దూమురిపాలే!
నీకు నా జీవితమంతా కాపలే!


కామెంట్‌లు