అద్భుతం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకానొకప్పుడు ఇద్దరు ముసలి భార్య భర్త వుండేవారు. బీదరికంలో మునిగి తేలుతున్నారు. ఎలాగోలా తామే కష్టపడి సంపాదించి తినాలనేది వారి మనస్తత్వం. ఎవరన్నా ఉచితంగా ఇచ్చినా తీసుకొనేవారు కాదు. ఒకరోజు అవ్వ అంది"ఏమయ్యోయ్!ఇలా మనం ఎన్నాళ్ళు బతుకు ఈడ్వగలం?కాలుచేతులు ఎప్పుడు ఒకేలా పనిచేయలేవుగదా?ఎవరు మనకు సాయం చేస్తారు?" "దిక్కులేనివారికి దేవుడే దిక్కు!నాశక్తి ఉన్నంత వరకు  నేను పనిచేసినిన్ను పోషిస్తాను సరేనా?"అన్నాడు తాత. "అందరూ సుఖం గా క్షేమంగా ఉండాలి అని దేవుని ప్రార్ధిస్తావుకదా?దేవుని అడుగు"నిష్ఠూరం గాఅంది అవ్వ. "దేవుడు ఏదిఇస్తే దాన్ని మనం స్వీకరించాలి.ఏం ఆడిగేది?" తాత మాటలకు రుసరుసలాడుతూ అంది ఆమె "స్వర్గం నించి మనకు ఉపయోగపడే వస్తువు అడుగు. దిక్కు దివాణం పిల్లాపీచు లేని వారం ! తండ్రి ఐనా కొడుకు ఐనా ఆదేవుడే!"భార్య మాటలు అతనిని కదిలించాయి.భగవంతుని ప్రార్ధిస్తున్న ఆతాతకి ఓఅద్భుతం కనిపించింది. కిటికీలోంచి ఒక బంగారు బల్లకి చెందిన కొయ్యకాలు లోపలికి పడింది. "ఏంటయ్యా అది?ధగధగా మెరుస్తోంది?" "అవ్వా!దేవుని బంగారు సింహాసనం కాలు ఒక టి మనకు పంపాడు.ఓచెయ్యి దాన్ని కిటికీ లోంచి పడేసింది.ఠక్కున మాయమైంది ఆచెయ్యి!"  "అబ్బో!చాలా బరువు గాఉంది దీనికాలు.దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది. హాయిగా మనంతిని ఇతరుల కింతపెట్టవచ్చు.ఈముసలివయసులో పిల్లాజెల్లాలేని మనకు ఆదేవుడే అండగా నిలిచాడు." ఆరాత్రి అవ్వకు ఓవింత కల వచ్చింది. ఆమె స్వర్గం లోకి అడుగు పెట్టింది. అక్కడ అంతా మంచి వారు ఆడమగవారు ఆమెని ఆప్యాయంగా పలకరించారు. ఆస్వర్గపుతోటలో అందరూ బల్లలచుట్టూఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నారు. అన్ని బల్లలకు నాలుగు బంగారు కాళ్ళు న్నాయి.కానీ ఒక దానికి మాత్రం మూడేకాళ్లున్నాయి.అది సరిగ్గా నిలబడక అటూ ఇటూ ఒరిగిపోతోంది.అంతే భయంతో అవ్వ కెవ్వున కేకలు వేసింది. తాత ను లేపింది. తనకువచ్చిన కలను వివరించింది."ఆమూడు కాళ్ళ బల్లదగ్గరే మనం కూచున్నాం.అది మనపై ఒరిగిపోతోంది. నాకు భయంతో మెలుకువ వచ్చింది. ఆబంగారుకాలుని తిరిగి ఆదేవుడికే ఇచ్చి వేయి."భార్య మాటలతో తాత వెంటనే ఆబంగారు బల్లకాలునికిటికీ దగ్గర ఉంచి దేవుని ప్రార్ధిస్తూ కూచున్నాడు. ఓచెయ్యి వచ్చి దాన్ని అందుకుని మాయమైనది.ఇప్పుడు అవ్వ తాతల మనసులు ప్రశాంతంగా ఉన్నాయి. మనం ఏమీ ఆశించకుండా నే  దేవుడే మనకు అన్నీసమకూరుస్తాడు"అనే ధైర్యం వారికి వచ్చింది.
కామెంట్‌లు