సమస్య:-కులకాంతకు సాటిరాదు కుంభిని లోనన్; -_సాహితీసింధు సరళ గున్నాల
కం*కలకాలము తోడుండుచు
కలహంసగకలిసియుండు కరుణామూర్తై
ఇలవత్తిగమారు పడతి
కులకాంతకు సాటిరాదు కుంభిని లోనన్

సమస్య:-కులకాంతకు సాటిరాదు కుంభిని లోనన్ ఆ.వె*
కలకాలము పిల్లలకై
పలురీతుల సేవజేయు భర్తకునైనన్
అలుపెరుగని యింతినిగన
కులకాంతకు సాటిరాదు కుంభిని లోనన్

అలనత్తకు మామకు తా
పలుకాడక సేవజేయు  భరమని మనమున్
దలవక,సేవలు జేసెడి
కులకాంతకు సాటిరాదు కుంభిని లోనన్

కామెంట్‌లు