బాల్య స్నేహం. కవిత.తాటి కోల పద్మావతి గుంటూరు.

 స్నేహమంటే అది స్నేహమే కాదు.
పసి హృదయాలను పెనవేసుకున్న స్నేహం.
బడిలో గురువు నేర్పిన పాఠాలు.
తోటి పిల్లల స్నేహాలు
జీవితానికి అనుబంధాల పూల తోట లో విరిసిన సినిమాలు.
ఆడే పాడే వయస్సు .
మంచి చెడు మాట్లాడుకునే మనసు.
బడి వదిలి పెట్టగానే చెరువులో ఈతలు
నీళ్ళల్లో దిగి పోటీపడి కోసే తామరపూలు
తడి బట్టలతో ఇల్లు చేరాక అమ్మ పెట్టే చివాట్లు ఏమి బాధించవు.
చింత చెట్టు కింద కాయలు 
రాళ్లతో కట్టిన మామిడి పిల్లలు
 ఉప్పు కారం అద్దుకుని తింటుంటే ఆ రుచే వేరు.
పక్కింటి తోటలో జామ కాయలు. 
ఎదురింటి బాదం చెట్టు ఎక్కి కోసిన ఆకులు
రాముల వారి గుడి లో ప్రసాదం కోసం పరుగులు తీసిన రోజులు
.
దొంగతనంగా కోసిన మొక్కజొన్న పొత్తులు
చెరకు గడలు పోటీపడి ఎత్తుకొచ్చి పంచుకున్న స్నేహితులు
ఇంటికి వచ్చాక నాన్న పెట్టే చివాట్లు
ఇవన్నీ బాధ అనిపించడం లే.
స్నేహానికి ఆటవిడుపు ఏ కానీ బాధ్యతలు బంధాలు తెలియవులే.
ఆ బాల్యపు స్నేహాలు వెన్నెల పూలై 
విరబూసి ఏదో ఒకనాటికి మధుర స్మృతులు మిగిలినప్పుడు
మనం పొందే ఆనందం ఇంతా అంతా కాదు.
స్నేహమంటే బాల్యపు స్నేహమే.
కులం మతం ధనిక పేద తారతమ్యం తెలియని అమాయకులు.
ఆ స్నేహాన్ని విడదీయ కుండా అలాగే ఉండాలని కోరుకుందాం.
అసూయ ద్వేషాలతో విషం చిమ్మి పాల మనసుల్ని విడదీయ వద్దు.
పెరిగి పెరిగి పెద్దయి మహావృక్షమై
 ఆ స్నేహపు నీడలో మరి కొంత మంది 
బాల్యాన్ని స్వేచ్ఛగా ఎగరాలని, 
స్వేచ్ఛా జీవులు కల్మషం లేని మనసులతో
 కలిసి ఉండాలని పెద్దలంతా కోరుకుంటే వారి 
ఆట పాటలు చిలిపి పనులు చిత్రమైన కథలు 
అన్నీ మనకు మురిపెము గానే కనిపిస్తాయి.
తేనె మనసులు వంటి పూల హృదయాలను
 పాలవంటి పసి హృదయాలను కలసి మెలసి ఉండాలని
 స్నేహానికి అంతం లేదని కడదాకా కలిసి ఉండాలని.
స్నేహమంటే చల్లని హస్తములా.
చీకటి తరిమికొట్టే వెలుగుల ఉంటుందని 
ఎప్పటికీ మరిచిపోలేని స్నేహ బంధాన్ని మధురంగా
 దాచుకో మని బడి బాల్యాన్ని పాలపిట్టల ఎగరాలని కోరుకుందాం.
కామెంట్‌లు