కణ్వమహర్షి; ప్రక్రియ: *పద్యము*(ఆట వెలది );--ఎం. వి. ఉమాదేవి

 1)
.తాను బ్రహ్మచారి తాపసి యైనను
తామరాకులoదు తనయ దొరుక
కన్న తండ్రి వలెను కంటికిన్ రెప్పగా 
శాకుంతలములకును సరిగ బెంచె!
2)
తానులేనపుడును తనయయె  గాంధర్వ 
విధిని పెండ్లి యాడ వెరపు లేక 
పెద్దమనసు తోడ సిద్ధమ్ము జేసెను 
పతిని గలుసుకొనుట పాడియనుచు!
3)
కాపురమ్ము కేగు కలికిని  బరికించి 
కనుల నీరు నింపి కష్టపడుచు 
తాపసికియె నిట్లు తపనలు గలిగించు 
బంధములవి నెంత బలముయనెను!!
కామెంట్‌లు