ఈ..క్షణం అపురూపం-టి.-కిరణ్మయి-కలంస్నేహం
ఎన్నో ఆశలు...
ఉదయించే కిరణంలా..
మా...మదిలో...
వెలుగులు. విరజమ్మే ఈ..క్షణం...
మాకెంతో అపురూపం!

మనసులో ఆశలు
సహస్ర కిరణాలే!
కానీ..
ఆ..కిరణాల వెలుగులు..,
బతుకున వెలగాలన్నా, లక్ష్యాల అవనినీ చేరాలన్నా.,.,
 పట్టుసడలనీ సాధనా పరిభ్రమణం..,
సక్రమమై సాగినపుడే..,
విజయానికీ తొలి సోపానం.!

అప్పుడే..
ఆశయాలకీ శ్రీకారం.
ఆనందాల ఉషోదయం.
ఆ..ఆనందాల ఉషోదయాన్నీ..,
ఆస్వాదించాలనే...,
వేయిచూపులతో..,
వీక్షిస్తున్న  ఈ క్షణం 
మా కెంతో అపురూపం!

కామెంట్‌లు