భూమి, ఆకాశం;-కోదాటి అరుణ- కలం స్నేహం

 గెలుపుంది,, నీలో ఓ మహిళా 
భూదేవి కున్నంత   ఓర్పుతో   సంసారాన్ని  గుట్టుగా నడపాలన్నా నీవే..
మనువాడిన  క్షణoనుండే పరాయి 
వ్యక్తిని  నీ వాడనుకునేలా  స్నేహత్వం
ఉంది నీలో..
పెళ్లి పేరుతో,పరాయింటి గడప 
కాలిడినంతనే   అందరూ నావా రనుకునే,మంచితనముంది,
   వారికి  వoశాన్ని  వృద్ధి చేస్తూ,
జీవితాంతం  సంతానం కోసం 
పరిత పించే   మాతృ హృదయముంది  నీలో!
 కన్నవారిని  సైతం  మరిచి,
కట్టుకున్నవారిoట    జీవితాంతం
కష్టాలు, సుఖాలు, అనుభవించే
భూదేవికున్నంత  సహనముంది నీలో..
చదువులలో ఉద్యోగాలలో, ఆర్థికం గా ఆకాశంమంత  ఎత్తు ఎదిగినా
 గృహానికే  ప్రాదాన్య
మిచ్చే స్త్రీ  మూర్తీ... నీకు వందనం... !

కామెంట్‌లు