తెలుగుతనం ...!!(మాటలు ..ఆన్షి,రాతలు..కె.ఎల్వీ)

 పోస్టులో మాఇంటికెప్పుడూ ...
పత్రికలెన్నో వస్తాయి -అవి
తాతపేరుతోనేఉంటాయి !
వాటినిచదవాలంటే చాల కష్టం 
తెలుగుభాషలో ఉంటాయవి !
మాతృభాషంటేతాతకుమక్కువ
ఆంగ్లం మోజులో మేము ఎక్కువ !
నెనైతే పత్రికలన్నీ చూసేస్తా 
బొమ్మలకోసం వెతికేస్తా ....!
పెద్దయ్యాకా తెలుఁగు నేర్చుకుంటా 
కథలూ -కవితలు గొప్పగ రాసేసి 
తాత కోరికను తీర్చేస్తా.......!!
                   ***
కామెంట్‌లు