తప్పుతెలిసింది (చిట్టికథ);-- డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్.
 రామాపురం జమీందార్ రావు బహుద్దూర్ తన పరిధిలో గల గ్రామాలను అభివృద్ధి చేయడమెలా?అని ఆలోచిస్తున్నారు.ఇంతలో ఒక యువతి వారిదగ్గరకు భయపడుతూ వచ్చి నిలబడింది.ఆమె భయానికి కారణాలడిగిన రావు బహద్దూర్ గారు నిర్ఘాంత పోయి అంతలో తేరుకొని తన ప్రధాన సలహాదారు తో ఒక పరిష్కారాన్ని చర్చించారు.ఆ యువతికి ఉన్న ఇద్దరు పిల్లలు ఎప్పుడూ దెబ్బలాడుకోవడం చేత ఇంట్లోనివారికి మనశ్శాంతి కరువైంది.ఎలాగైనా ఆ ఇద్దరినీ పోట్లాటనుండి తప్పించి వారికి ఏదైనా పని చెప్పాలని ఆలోచించారు. ఇంకేం ఆ ఇద్దరు బాలలను పిలిపించి "మీలో ఎవరు బాగా చదువుకుని ,మంచి నడవడితో అందరితో మంచివాడుగా పేరు తెచ్చుకుంటారో వారికి నా కూతురును ఇచ్చి పెళ్లి చేస్తాను.ఇంకా నా ఆస్తిలో సగభాగం కూడా ఇస్తాను."అని చెప్పాడు జమీందారు. ఇంకేం. అప్పటి నుండి ఇద్దరూ బాగా చదువుకుని మంచి నడవడితో అందరితో మంచివాళ్ళుగా అనిపించుకున్నారు.వారిద్దరికీ తమ తప్పు తెలిసింది.ఇక జమీందారు గారికి ఉన్న ఇద్దరు కూతుళ్ళను ఇద్దరికిచ్చి పెళ్లి చేశాడు.అంతా హాయిగా కాలం గడిపారు.

కామెంట్‌లు