శివాయ నమః - బాల గేయం ;-ఎం. వి. ఉమాదేవి.
శివాయ నమః భవాయ నమః 
శివోహమందుము నేడు!

మహేశ నమః గిరీశ నమః 
మహాదేవునిక వేడు !

నటరాజ రాజ హిమశైల వాస
జయ వీరభద్ర శాంతం!

విరామ నమః విరూప నమః 
విరూపాక్షాయ శరణం!


భస్మాయ నమో  భద్రాయ నమో  
బృహుదీశ్వరాయ జయహే!

సోమాయ నమో  కాలాయ నమో 
సోమనాథాయ వందే!

విశ్వతేజాయ నిర్గుణాoశాయ
విశ్వనాథాయ శరణం!!

కామెంట్‌లు