సు (నంద)భాషితం;-*సునంద వురిమళ్ల,ఖమ్మం*
 *జ్ఞానం అపరిమితమైన సంపద*
******************
*జ్ఞానం అపరిమితమైన సంపద. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా మిగిలే ఉంటుంది.* 
*అంతో ఇంతో సంపాదించుకున్నాం కదా అనుకుని తృప్తి పడితే, అంతటితోనే మన జ్ఞానాభివృద్ధి ఆగిపోతుంది*. 
*అందుకే నిరంతరం జ్ఞాన సముపార్జన చేయడానికి  మనస్సును సమాయత్త పరుచుకోవాలి, జ్ఞాన తృష్ణ పెంచుకోవాలి.*
*అప్పుడే మనలోని జ్ఞానసంపద  అంచెలంచెలుగా పెరుగుతూ,మేథస్సును వజ్రంలా ప్రకాశింప జేస్తుంది. అంతేకాదు మానసికమైన తృప్తిని  కూడా ఇస్తుంది.*
*సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*

కామెంట్‌లు