బ్రతుకుబాట ..!! > బడిబాట ;కోరాడ నరసింహరావు >విశాఖపట్నం*

  ఎంతైనా... అమ్మ  అమ్మే... !
ఇలా ఐతే కొడుకుచెడిపోతాడు 
వాడి వెనక ఓ తమ్ముడు ముగ్గురు చెల్లెళ్ళు  ఉన్నారు... 
తండ్రి చూస్తే... ఏ బాధ్యతనూ పట్టించుకోక... తన తాగుడు... 
తనసుఖమేచూసుకుంటున్నాడు...ఏదైనా మంచి పనిలో పెడితే మంచిది అనుకుంది !
మా పార్వతీపురం లోని బెలగాంలో... డాక్టర్ శివదయాళ్ దగ్గర నన్నుంచారు 
నయమే... నన్నక్కడ పెట్టారు !
నాతమ్ముడినైతే... వాడు సరిగ్గా బడికి వెళ్ళటం లేదు అనే నెపంతో... ఒకటవతరగతి చదువుతుండగనే బడి మాన్పించేసి హోటల్ లో ఎంగిలి ప్లేట్లు, గ్లాసులు కడవటానికి పెట్టేసాడు ,మా  తండ్రి !
ఐతే ఒక్కసారిగా నేను ఇల్లు విడిచి పూర్తిగా ఆ డాక్టర్ గారింట్లో ఉండవలసి రావటంతో... అంతాకొత్తగా భయం -  భయంగా ఉండేది !
ఆడాక్టరుగారిది ప్రేమ వివాహమట భార్యకూడా డాక్టర్ !
వాళ్లకు పెళ్ళైన ఏడాదికే ఇద్దరు కవలపిల్లలు భార్య, ఇద్దరు పిల్లలూ కూడా దురదృష్ట వశాత్తు కారేక్సిడెంట్ లోపోయారట... ఆయన నన్ను ప్రేమగానే చూసుకునే వారు ఆపరేషన్లు చేసేటప్పుడు పక్కనేఉంచుకోటం... మందుల చీటీ ఇచ్చి మందులు పొట్లాలు కట్టించటం ఆపరేషన్ పనిముట్లను స్టవ్ మీద బాయిల్ చెయ్యమనటం... అంతా కొత్తగా... తడబాట్లు పొరపాట్లతో... అక్కడ ఇమడలేక పోయాను... !వారం తరువాత మావాళ్ళొచ్చి ఓ మారు ఇంటికి తీసుకెళతామని చెప్పి అక్కడినుండి తీసుకొచ్ఛారు... ఇంక అక్కడికి తర్వాతనేను వెళ్ళలేదు !
తరువాత... జగన్నాధ అని...
పెయింట్లు వేసేవాడు మావీధి లోనే ఉండేవాడు... తమ్ముడూ వీడికి పని నేర్పరా... వాడికాళ్ల మీద వాడునిలబడి...  నీలాగే 
చెల్లెళ్లను చూసుకుంటాడు అని చెప్పి... అతని వెంట పంపింది మాఅమ్మ
నాలుగు రోజులు అతని వెంట వెళ్లాను... హంసకాగితాలతో 
గజాల తుప్పుగీకటం... నా సుకుమారతనాన్నిచూసాడు
నేను అతిసుకుమారమే ఐనా గాడిద బ్రతుకే అయిపోయింది !
అక్కా వీడు ఇలాంటి పనులు చేయలేడు... నాకు తెలిసిన ఫోటో స్టూడియో ఒకటుంది వీడ్ని అక్కడ పెడతాను అనటం... ఇంతలో... మాస్కూల్ హెడ్మాస్టర్ శిఖా జోసెఫ్... మాఇంటికి వచ్చి 
అమ్మా వీడినెందుకు స్కూల్ కు పంపటంలేదు అని అడగటం.. 
బాబూ... కడుపునిండా తిండే లేదు... ఇంక పుస్తకాలు, ఫీజులు మేమేం కట్టగలం అంటే 
... ఫీజు నేను కడతాను... పుస్తకాలు కూడా ఏర్పాటు చేస్తాను పంపండి అనటంతో 
నాలో చెప్పలేని ఆనందం... 
మళ్ళీ బడిబాట పట్టాను !
                   ****************     
                           సశేషం.
కామెంట్‌లు