అబ్బాయిలతో సమంగా ఆడేదాన్ని ;సత్యవాణి ! సేకరణ ; -అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆమెతో నాపరిచయం పాతికేళ్లు.కలిసింది నాలుగు సార్లు.దేశభక్తి దేశప్రేమ కుండబద్దలు కొట్టేలా మాట్లాడే ముక్కుసూటి మనిషి!ఆమె పూర్తిపేరు గొట్టిపాటి అనంత అన్నపూర్ణ సత్యవాణి.కృష్ణ జిల్లా ముసునూరు లో పుట్టారు. ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నలు ఇద్దరు తమ్ముళ్ళ మధ్య  మహా అల్లరి చురుకైన పిల్ల గా ఊరంతా మార్మోగింది ఈమెపేరు. ఇంటి నిండా పాడిపంట దైవ దేశభక్తి పుష్కలంగా ఉండేవి. ఎస్. ఎల్.సి.పాసుకాగానే మిలటరీ సివిల్ ఇంజనీర్ తో పెళ్ళి  ఇద్దరు పిల్లల తో సంసార బాధ్యతలు వహిస్తూ సమాజసేవలో చురుగ్గా పాల్గొనేవారు. స్వీట్స్ పుల్లారెడ్డిగారి ప్రేరణతో  భారత వికాస్ పరిషత్  ప్రోగ్రాంలలోపాల్గొనేదాన్ని.1జనవరి1988లోతిరుపతి ధర్మ సమ్మేళనంలో చిన్మయామిషన్ స్వామీజీ ముందు 7నిముషాలు అనర్గళంగా మాట్లాడారు. శ్రీ కంచి పరమాచార్య ఆశీస్సులు లభించాయి.లండన్ విరాట్ సమ్మేళనంలో 15రోజులున్నారు.మహిళా వివేకానంద అని పిలిచేవారు. యూరప్అంతా పర్యటించారు. అయోధ్య లో తొలి శిలాన్యాస్ చేసి న వ్యక్తి గా గుర్తింపుపొందారు.ఆర్షవాణి సత్యవాణిగా అల్ కబీర్ ఉద్యమం లో కేవలం ద్రవపదార్థాలు తీసుకున్నా రు మూడు నెలలు.బ్రిటిష్ వారు హిందూ అనే పదంకి అపార్ధం కలిగించారు. ఏఒక మతం కులం జాతికి చెందినది కాదు హిందూ ధర్మం. మియాపూర్ ధర్మ పురి క్షేత్రం లో 16దేవాలయాలు  అందరి సహాయ సహకారంతో కట్టిం చి ప్రతి పండుగకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పిల్లలు స్త్రీ లకు ప్రేరణగా నిలుస్తున్నారు.
---------------------------------------------------------
సత్యవాణిగారు తన బాల్య స్మృతులు ఇలాచెప్పారు"చిన్నప్పుడు నన్ను బడిలో వేస్తే  మాఇంట్లో  పనిఆమె తీసుకుని వెళ్ళేది. బడికెళ్ళకుండా ఆమెని సతాయించి మాచిన్న నాన్నమ్మ ఇంటికి వెళ్ళి కమ్మగా అప్పచ్చులు తినేసి సాయంత్రం బడివిడిచే టైంకి ఇల్లు చేరేదాన్ని.పలక బలపం డిక్టేషన్తో తెలుగు తప్పులు లేకుండా  ఉచ్చారణతో సహా పిల్లలం బాగా నేర్చుకునేవారం.మార్కులు ఖచ్చితంగా తూచి తూచి వేసేవారు. 5వక్లాస్లో ఎ.బి.సిలతో ఆంగ్లంమొదలు.తెలుగు ఇంగ్లీషు మాష్టార్లు శ్రీ నరసింహాచార్యులు గారు  శ్రీ వెంకటేశ్వరరావు గారు బాగా నన్ను ప్రోత్సహించే వారు.ఆరెంటిలో నాదే ఫస్ట్ మార్క్.కో ఎడ్యుకేషన్ తెలుగు మీడియం జడ్.పి.స్కూల్ లో  చదివాను. హిందీ లో కేవలం  5మార్కులు వస్తే చాలు. హిందీ ప్రశ్నాపత్రం ఆన్సర్ పేపర్ పైరాస్తే పాస్ చేసేవారు. పరీక్షల్లో   6వక్లాస్ కుర్రాడు "అక్కా!టపాకాయలు దీపావళి కి కాలుస్తారు  అని హిందీ లో ఎలారాయాలి?"అని అడిగాడు. 8వక్లాస్ చదివే నేను బుర్ర ఉపయోగించి ఇలాచెప్పాను "దీపావళి కో టపాకాయలు ఢాంఢూంహై"అనిరాయి.మరి 8వక్లాస్ చదివే నేను అలాచెప్పాను. నాకు బాగా పొడవాటి జుట్టుఉండటంతో భారత మాతవేషం నాదే !స్కూల్ లీడర్ గా సాంస్కృతిక కార్యక్రమాలు చెట్ల పెంపకం  ఊళ్ళో ప్రోగ్రాంలకు  నేనే చొరవ తీసుకొనేదాన్ని.సాహసం చొరవ ఎక్కువ. బడి లాబ్ లో రక్త పరీక్ష ఎలాచేస్తారో చూపటానికి బ్లేడుతో వేలు కోసుకుని మరీ చూపాను.ఆరోజుల్లో ఆడపిల్ల లు మరీ నాఅంత అల్లరి చిలిపిగా ఉండేవారు కాదు. అమ్మా నాన్న అరుస్తున్నా చెట్లు ఎక్కేదాన్ని.లెక్కలు లో నాకు జీరో మార్కులు. కానీ జీవితం అనే లెక్కల్లో నెగ్గుకు రాగలిగాను. మగపిల్లలను కూడా బాగా ఏడిపించేదాన్ని. జానకిరావు అనే అబ్బాయిని"జానకీ!రావూ?"అని ఆడపేరుతో సతాయించేదాన్ని.తెలుగు మాష్టారి బల్లసొరుగులో కప్పను పెట్టాను.ఆయన చాక్పీస్ కోసం సొరుగులాగగానే కప్ప చేతికి తగలటం  అంతా భయంతో దాని గెంతులకి  కెవ్వుమనటం తొలి సారి మాష్టారి కర్రదెబ్బ రుచి చూడటం భలే తమాషాగా అనిపిస్తుందినాకు.మాష్టారు రాసిన పుస్తకాల ను నేను అందంగా ఫెయిర్ చేసేదాన్ని. ఆరోజుల్లోనే లాల్ బహదూర్ శాస్త్రిగారి వీరాభిమానిని.లలితా శాస్త్రి గారికి లేఖరాస్తే జవాబు కూడా ఇచ్చారు. శ్రీసంజీవదేవ్ ఇంకా చాలా మంది కవులు కళాకారులతో కలంస్నేహం చేసేదాన్ని. సినీనటి సావిత్రి గారినించి కూడా లేఖ అందుకున్నా.ఇక చైనా యుద్దసమయంలో చెవిపోగులు ఇంట్లో చెప్పకుండా  ఇచ్చానుదేశరక్షణనిధికి.అబ్బాయిలతో సమంగా గోలీలుఅన్ని రకాల ఆడేదాన్ని.ఒకసారి మానాన్నతో సిగరెట్ పాకెట్స్ పేర్లు చెప్పితే  "నీకు ఇవన్నీ ఎలాతెలుసు?"అని బాగా తిట్టారు. 1966లో మాఊరికి కరెంటు వస్తే ప్రోగ్రాములు చేసి  చేయించాను.బుడ్డి దీపంవెలుగులో నేను మాచిన్న అన్న  పాఠాలు నాటకీయ పద్ధతి లో పెద్దగా చదివేవారం.మా ఊరి పూల రంగడు అనేవాడు జేబులనిండారకరకాల వస్తువులతో తిరుగుతూ మిమిక్రీ చేయటం నాకు నచ్చేది. అలా నేనూ మిమిక్రీ చేస్తూ నవ్వించేదాన్ని.ఏడిపించేదాన్ని.మామేనత్త కొడుకు ని తుఫాను అనిపిలిచి ఒకరోజు  వాడిని పడుకోబెట్టి నిండా ముసుగు కప్పాను.ఆపై శోకాలు పెడుతూ నేను అరుస్తుంటే ఏదో ఐందని మానాన్నగారు పరుగున రావటం అక్కడున్న మాబంధువులంతా  నేను చేస్తున్న మిమిక్రీ ని గూర్చి చెప్పటం మాతుఫాన్ భయంతో బిగుసుకుపోవడం  ఇప్పటికీ అంతా చెప్తారు.1969లో పెళ్ళి సంసారం సంఘసేవ మొదలు ఐంది.మానాన్నగారు  నాకు రామాయణం ఇచ్చి "కష్టం వచ్చినా మౌనంగా భరించాలి.నలుగురికి మంచి చేయాలి."అన్నమాటలే నాకు శిరోధార్యం.ఎసెల్సీతో చదువు ఆగినా బాధ లేదు. డాక్టర్ లేక నర్సు కావాలి అనుకున్నాను. కానీ అందుకు బాధ పడను.స్కూల్ కాలేజి విద్యార్ధులకు స్త్రీలకు ఆధ్యాత్మిక నైతిక విలువలు బోధిస్తూ  దేశసేవ తో పాటు దైవ భక్తి  గూర్చి తెలుపుతూ నాజీవితం సార్ధకం చేసుకునే యత్నం లో ఉన్నాను."ఈమె ప్రతిదీ విశ్లేషించి చెప్తారు. టి.వి.అన్ని ఛానళ్ళద్వారా ఆమె సుపరిచితులు.
కామెంట్‌లు