అడుగుజాడలు--చంద్రకళ. దీకొండ-కలం స్నేహం
పిల్లల భావిజీవితపు పల్లకీని మోసే మాతాపితరులు...
విద్యార్థుల సుందర భవిష్యత్తుకు బాటలు పరిచే గురువర్యులు...;

గ్రహాల గమనాన్ని,నక్షత్రాల చలనాన్ని లెక్కగట్టిన వేదవిజ్ఞాన పండితులు...
నీతిశతకాలతో మనసులలోని మాలిన్యాన్ని కడిగిన శతక,వాగ్గేయకారులు...;

రాబోవు ఆపదను ముందుగానే కనిపెట్టే పరికరాలను 
సృష్టించిన శాస్త్రవేత్తలు...
భవిష్యత్తు కాలాన్ని ఊహించి చెప్పిన విజ్ఞాన కాల్పనిక రచయితలు...;

సాంఘిక దురాచారాలను రూపుమాపుటకై పోరాడిన సంఘసంస్కర్తలు...
గళమెత్తిన ఉద్యమకారులు...
కలం పట్టిన కవులు,రచయితలు...

దార్శనికులందరికీ వేనవేల దండాలు...!!!


కామెంట్‌లు