గీతాంజలి ; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 18." వాకిట నిరీక్షణలు"
(ఆత్మ పరమాత్మకోసం నిరీక్షించే భావన) దట్టంగా మబ్బులు అల్లుకొని చీకట్లు కమ్ముకున్న స్థితిలో ఈ ప్రపంచపు వాకిట్లో ప్రియా నన్ను నీకోసం ఎదురు చూడమంటూ వదలి వెళ్ళావు. సాధారణ జీవితంలో మధ్యాహ్నపు పనివేళ అందరితో నేను కలిసి వున్నాను. ఐతే చీకటిపడే వేళకు నాసఖుడవైన నీకోసమే ఆశతో ఎదురు చూస్తుంటాను. నన్ను నువ్విలా వదిలేస్తే ఈ రాత్రి ఎలా గడుస్తుంది? గుబురు గుబురుగా అలుముకున్న మబ్బులతో నిండిన నింగికేసి చూస్తూ నీకోసం పరితపిస్తుంటే నా హృదయం మాత్రం గాలి విసుర్ల వేగంలో నీకోసం విలవిలలాడుతూ, పరుగులు తీస్తుంది.

కామెంట్‌లు