జాతర (బాలగేయం);-:- డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్.

 జాతరమ్మ జాతర ఏడుపాయల జాతర
వనదుర్గా జాతర అమ్మవారి జాతర
మంజీర నదిమధ్యన మహామహా జాతర
దసరా పండుగ జాతర జోరుదారు జాతర
!!జాతరమ్మ జాతర!!
గుడిలోన అమ్మవారి పూజలే పూజలు
గుడికొచ్చిన భక్తుల బోనాలే బోనాలు
రథములోన అమ్మవారు తిరుగుడే తిరుగుడు
గుడిచుట్టూ ఎడ్లబండ్ల పరుగులే పరుగులు
!!జాతరమ్మ జాతర!!
జాతరలో జనాలు బాగున్నరు బాగున్నరు
జాతరలో ప్రసాదాలు భలేరుచి భలేరుచి
జాతరలో బొమ్మల అందమే అందము
జాతరలో మిఠాయిల తీపి తీపి అనుభవాలు
!!జాతరమ్మ జాతర!!
జాతరలో పూనకాలు భయపెడతయి భయపెడతయి
జాతరలో పోతరాజులు భయపెడతరు భయపెడతరు
జాతరలో ఆటలు చూసి సంతోషమే సంతోషము
జాతరలో పాటలు విని ఆనందమే ఆనందము
!!జాతరమ్మ జాతర!!

కామెంట్‌లు