బ్రతుకుబాట ...!! ,>మాయదారి మల్లిగాడు.కోరాడ. నరసింహరావు >విశాఖపట్నం

    ------ 9 -------
     జర్దాకిల్లీ... సిగరెట్లతోనే ఆగలేదు....అన్నిరుచులూ ఓ మారు చూసేయాలనే తహ - తహ....చుట్ట, బీడీలనూ వదలలేదు !
మాపెద్దగురువు నాచేత బ్రాoదీ 
తెప్పించుకునేవారు... ఆషాపులో బోర్డు మీది పేర్లు చదువుతూ... దేని రుచి ఏమిటో చూడాలనిపించేది !
వీలు చిక్కినప్పుడల్లా... ఆ అన్నిరుచులతో పాటు... ఈతకల్లు, తాటికల్లు, జీలుగ కల్లు రుచులను చూస్తే గానీ 
నా  తృప్తి తీరేదికాదు... ఇంకా 
ఎవరో చెప్పారు మాఊరికి దగ్గరలో ఉన్న కొత్తపట్నంలో  రాజకుటుంభీకులు మదన కామేశ్వరం అనే చిన్న - చిన్న చక్కీలు అమ్ముతారు... ఆ కిక్కే 
కిక్కు అనటంతో... సైకిల్ మీద ఆఊరి కివెళ్లి ఆ అనుభవాన్ని కూడా చవి చూసేసాను !
   ఈ సంఘం... డబ్బుకిచ్చే గౌరవాన్ని నిజాయతీ, మంచితనాలకివ్వదు అనేవిషయం 
నాకు... 
మహంతి వీధిలోని మల్లిగాడి 
ని చూస్తే  బోధపడింది !
   వాడు ఇల్లువిడిచి పెట్టి వెళితే 
...ఓ రెండు, మూడు రోజుల తరువాత బోలెడంత డబ్బుతో తిరిగొచ్చేవాడు ! ఇంతకీ వాడు చేసే పనేమిటీ అంటే... ఒరిస్సా ,మధ్యప్రదేశ్
.. వెళ్లిపోవటం బేగులు సూట్కేసులు దొంగిలించటం !!
బాగా జల్సా చేసేవాడు !
ఆ విషయం అందరికీ తెలుసు 
గానీ యే ఒక్కరూ వేలెత్తి చూపేవారు కాదు !ఆవీధి లోని కొందరు ఆడవాళ్లు కూడా పేకాడేవారు ! వాళ్లంతా సంసారులే ఐనా పేకాటకి డబ్బులు లేక పొతే వ్యభిచరిం చటానికి కూడా సిద్ద పడేవారు 
అందరూ ఇలాంటి వారితో మామూలుగానే వ్యవహ రించేవారు.... !
    ఈ మల్లిగాడు... ఊర్లో ఉంటే.. నేను రోజూ కూచునే పాన్ షోప్ కి వచ్చేవాడు దాపరికం లేకుండా అన్నివిషయాలూ చెప్పేసేవాడు !
ఒక్కోమారు... ఊరినుండి ఒళ్ళంతాదెబ్బలతో...వికృతమైన  మొహం తో కనిపించేవాడు 
ఏమి జరిగిందని అడిగితే.... దొరికిపోయాను రా... చావ చితగ్గొట్టేసారు.ఇంటినుండి  వెళుతూ యే చండాలం ముఖం చూశానో అనేవాడు ! కొన్నాళ్ళకు ఆ బ్రతుకుతో విసిగిపోయి వాడు లారీ  క్లీనర్ గా బ్రతకటం మొదలు పెట్టాడు !
అప్పుడప్పుడూ నాకు గజ్జీ, దురదలు మళ్ళీ మొదలు పెట్టాయి... ఆ పాన్  షాప్ కు 
ఓ కంఫౌండర్ వచ్చేవాడు... అతడే... ఓమారు వేకువనే మా అమ్మ విరేచనాలతో చచ్చి పోయే  పరిస్థితిలో ఉంటే ఆవేళప్పుడు 
హాస్పిటళ్లు ఎవరూ తియ్యక దిక్కు తోచని పరిస్థితుల్లో... దేవుడిలా కనిపించి మా అమ్మను బ్రతికించాడు..!
నేనీ గజ్జి, దురదలు గురించి చెప్పాను !
 నీ రక్తం చెడింది... దీనికి ఓ రోజు కాల్షియం ఓరోజు పెన్సిలిన్ ఇలా ఆరు డోసులు  కోర్సు వాడాలి అన్నాడు... !
అతడే... రోజూ ఆపాన్ షాప్  
లోనే ట్రీట్మెంట్ ఇచ్చాడు అక్కడితో ఆ చీడ నన్ను పూర్తిగా వదిలేసింది.... !!
                  *****************
                  ***** సశేషం  *****

కామెంట్‌లు