వనభోజనాలు - ఇష్టపదులు ;-ఎం. వి. ఉమాదేవి
పూజలో భాగముగ పుణ్యమూర్తులు వెడలు 
కార్తికము మాసాన కలసి వనభోజనము 

నదీ తీరము నందు నయమొక్క దేవళము 
ఎన్నుకొని వెళ్ళెదరు ఎన్ని కష్టము లైన 

నదిలోన శుచిగాను నటరాజు నేగొల్వ 
యభిషేక హారతులు యంతటను జరిపేరు 

ఉసిరి వనము నందు ఉంచియును దీపాలు  
వనభోజనము జేసి వాసిగా గొల్చెదరు 

ఓషధీ విలువలను ఒక తోటలోనుండు 
రుగ్మతల బాపుచును రూపవంతులజేయు

స్థలపురాణము వల్ల స్థానికపు చరిత్రయు 
కొత్త ప్రదేశమునను కొన్ని యాకర్షణలు 

తుమ్మి పూవుల,యాకు తులలేని బిల్వములు 
శంఖు పుష్పాలతో శంకరుని యర్చించు 

పదిమంది కన్నమును పావనము దానములు 
శిశిరమ్ము న చంద్ర  శేఖరుని గొ లిచేము !!

కామెంట్‌లు