వేగుచుక్క-కాకరపర్తి పద్మజ--కలం స్నేహం
అతివ పుట్టగానే లక్ష్మీ దేవి వలే
పిలువబడుతుంది
మువ్వల అడుగుల సవ్వడితో సిరిలక్ష్మి వలే
అగుపడుతూ
బాలామణిగా ఎదిగే కొద్ది  ఏ దివిలో దొరికిన పారిజాతం  వలే కనపడుతుంది

యవ్వన సొగసుల ఆగమనంతో  ఆమె అందం నిండు పున్నమి వలే  ప్రకాశిస్తూంది 
అందమైన పొడగాటి జడ నాగుపాము వలే మెలికలు తిరిగినట్లుటుంది
సన్నని నడుము సన్నజాజి  చక్కదనాలతో మేని నింగిన 
వెలసిన హరివిల్లవుతుంది
కలువల వలే కనులు కాటుక మడుగులో విచ్చుతుంటే

తూర్పు సింధూరం వలే చెక్కిళ్ళలో సిగ్గు గులాబీలుగా
విరపూయిస్తూ
బుగ్గనద్దిన  నల్లటి చుక్క తో…
మూడుముళ్ళ బంధంతో మగువగా మారి మెట్టెల సవ్వడితో సంసార కడలిలో  నావ వలే కాలు పెడుతుంది

మాతృత్వ వరంతో  ఆ ఇంట సంతాన లక్ష్మి వలే మయూరం లా నడయాడుతుంది
కష్టమైనా సుఖమైనా గెలుపైనా ఓటమైనా
అవని వలే ఓర్పుతో ఓపిక కోటను కట్టే ఇల్లాలుగా
జీవిత రహదారిలో వేగు చుక్కలా దారి చూపిస్తుంది..!!

కామెంట్‌లు