మహిళ దేశానికి రక్షణ తోరణంబాల గేయం -ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
మహిళ నిద్ర లేచింది
మహిని చుట్టి వచ్చింది
మహిమంతా చూసింది
మహా మాతగ నిలిచింది

అష్ట దిక్కులు చూట్టింది
నిష్ఠతోడ ఆమె నిలిచింది
ఆయుధము చేత పట్టింది
క్రమశిక్షణ చూపి కదిలింది

డేగ కళ్ళు చేసి చూసింది
కొండలు కోనలు దాటింది
మంచుకొండల్లో తిరిగింది
గుండెల్లో ధైర్యం నింపింది

శత్రు మూకను చూసింది
ఎదురు నిలిచి పోరాడింది
వారిని తరిమి తరిమి కొట్టింది
దేశరక్షణకై ఆదిశక్తిగ నిలిచింది


కామెంట్‌లు