చోద్యం;-మర్రి జయశ్రీ--కలం స్నేహం
 అసలే కరువు రోజులు
ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం
 పడిగాపులు కాసే  సామాన్య జనం
ఏది పోగొట్టుకోవద్దని
పోరాడి మరి పొందుతున్న ప్రజానీకం
ఉచితాల కోసం ఉబలాటం
ఎంతకైన తెగించే సాహసం
సమయము పోతే
ఇంకెప్పుడు దొరకదేమోననే సందేహం
బతుకమ్మ సంబరాల్లో
తెలంగాణ ఆడపడుచులకు
అన్నయ్య  పంపించె చీరలు
శ్రీమతిగారు ఊర్లో లేకపోయేసరికి
భార్యామణికి చీర  మళ్ళీ ఇవ్వరేమో అనుకున్నాడేమో ప్రబుద్ధుడు
తగుదునమ్మా అంటూ
చీర సింగారించుకొని
మగువల వరుసలో నిలుచొని
సిగ్గుతో నిండా ముసుగేసుకున్న వెంకట్రాయుడిని పసిగట్టిన
పక్కింటి పంకజం
మీ ఆవిడ ఊర్లో లేకుంటే
ఇదేం చోద్యం అంటూ పలకరించింది
ఊహించని పరిణామానికి
అవాక్కయ్యాడు అయ్యవారు

కామెంట్‌లు