వనమాలి;-ముత్యపు భాగ్య లక్ష్మి-కలం స్నేహం
గోదారి వరదలా ఉరకలు వేసే యవ్వనం
ప్రపంచంలో అణువణువునీ స్పృశిస్తూ
సమస్తం నేనే అనే వుబలాటం

లేలేత భానుడు 
తామరలను ముద్దాడు తుంటె
తుషార బిందువులు
గరిక భామలపై 
ముత్యమల్లే మురిపిస్తుంటే

కొమ్మల మాటున దాగిన
కోకిలల పాడే సన్నాయి రాగాలు 
వీనుల సోకగా
* నా మనసు ఓ మౌన రాగం*
ఆలపించింది

ఒంటరి హృదయం కోరుకుంటోంది
* ఓ గుప్పెడంత స్నేహం*

ఆకులో ఆకునై 
కొమ్మల్లో దాగినట్టు
పూలపై  తుమ్మెద వాలినట్టు
నీ ఎదపై నే వాలి సోలిపోవాలని
ఈ అందమైన ప్రకృతిలో
* ఒక సెల్ఫీ ప్లీజ్*
అంటూ 
సొగసైన మన చిత్రం
సెల్ఫోన్ లో బంధించి
నా కన్నుల మాటున
దాచుకుందామనీ

నా ముగ్ధ మనోహరమైన అందం చూసి
నీ పెదవులపై విచ్చుకున్న 
 *నీ నవ్వు ఉంటే తిరు నాళ్లే *నా
 బతుకున వేల పున్నమలే

రాధా మాధవుల 
సలీం అనార్కలి 
ముంతాజ్ షాజహాన్ ల
ప్రేమలా
అనిర్వచనీయం
ఆదర్శనీయం
అయి న ప్రేమికుల లా
మన ప్రేమ అజరామరం కావాలని
ప్రతి క్షణం నీ ప్రేమ
ఝరిలో తడిసి పోవాలనీ
పరుల కన్ను సోకకుండా
మన ప్రేమ బృందావనికి
* జీవితమంతా కాపలానే*ఉంటా
నేనో వనమాలినై
వలపు సీమకు మహ రాణి నీ నేనై...


కామెంట్‌లు