స్వేచ్ఛా పక్షినయ్యాను --పి విజయ రాఖి --కలం స్నేహం
నీవు వదిలి వెళ్ళిపోయాక 
నేను స్వేచ్ఛా పక్షినయ్యాను

నీవు చేసిన గాయాల గుర్తులు
గతకాలపు చేదు జ్ఞాపకాలై
నను వీడక వెంటాడుతుంటే
కన్నులు సంద్రాలై కన్నీరుప్పొంగి
నిలువెల్లా తడిసి ముద్దయిపోయా

ఎందుకు ఎలా తడిసిపోయానో
అలలెందుకు ఉవ్వెత్తున లేచెనో
తీరాన్నెందుకు ఆలింగనం చేసుకునెనో
నిలువెల్లా గాయపడిన మనసుకు
అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది

కానీ,
ఎందుకో......, ఏమో....?
తీరం....  ఓదార్చిందేమో...
అలల హోరు తగ్గగానే
హృది భారం దిగిపోయింది
మనసు మల్లియలా తేలికయ్యింది

కామెంట్‌లు