తగని స్నేహం.;-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 కొత్తగా పదవతరగతి చదవడానికి  పాఠశాలలో చేరిన రామంతో స్నేహం కుదిరింది శివయ్యకు.రామం బలంగా ఎత్తుగా ఉంటాడు, పాటశాలలో చేరిన వారం రోజులకే మూగ్గురు విద్యార్ధులతో గొడవ పడ్డాడు.శివయ్య ఎత్తుగా ఉన్నప్పటికి బక్కపలుచగా సౌమ్యంగా ఉంటాడు.
పాఠశాల సెలవు దినం రోజున,నాలుగు కిలోమీటర్ల దూరంలోని  పక్కఊరిలో తిరునాళ్ళజరగడంతో రామం శివయ్యను పిలుచుకువెళ్ళాడు.అంతదూరం  నడచి వెళ్ళడంతో రాత్రి సమయం అయింది.తిరునాళ్ళ జరిగే ఊరికి సమీపంలో,మిత్రులు ఇరువురిని దొంగలు ఆపి డబ్బులు ఉంటే బయటకు తీయండి అన్నారు.సౌమ్యుడైన శివయ్య తనవద్ద ఉన్న డబ్బులు వాళ్ళకు ఇచ్చి మౌనంగా నిలబడ్డాడు. దూకుడు స్వభావం భావం కలిగిన రామం దొంగలపై తిరగబడ్డాడు.దొంగలు రామానికి నాలుగు దెబ్బలువేసి కూర్చోపెట్టారు.
'నన్ను కొట్టడం కాదు మీకుధైర్యముంటే మాశియ్యపైన చేయివేయండి చూద్దాం! మీఅందరిని కలిపి తంతాడు' అన్నాడు రామం.
' నువ్వు అంతటి వీరుడవా? ' అని శివయ్యనుకూడా నాలుగు దెబ్బలు వేసి కూర్చోపెట్టి,కొద్దిసేపటికి దొంగలు వెళ్ళిపోయిరు.
' ఏమిటి నిన్నుకూడా దొంగలచేత తన్నించానని ఆలోచిస్తున్నావా? నాకు మాత్రమే దెబ్బలు పడితే రేపు పాఠశాలలో అందరికి చెపుతావు అందుకని నీకు దెబ్బలు పడేలా చేసా ఇప్పుడు నువ్వు దొంగలు నన్ను కొట్టారని ఎవ్వరికి చెప్పలేవు,ఎందుకంటే దొంగలు నిన్నుకొట్టారుకనుక ఎలా ఉంది నాతెలివి' అన్నాడు.
అతని మాటలకు ఆశ్చర్యపోయిన శివయ్య రామంతో స్నేహం తగదు అని అనుభవపూర్వకంగా తెలుసు కున్నాడు.

కామెంట్‌లు