లాలా హమారా ప్యారా!అచ్యుతుని రాజ్యశ్రీ

 లాలా లజ్పత్ రాయ్!హమారా ప్యారా లాలా!
ఆర్యసమాజం నాతల్లి!
వైదికధర్మం నాతండ్రి అన్నావు
గులాబీదేవి రాధాకిషన్ ముద్దుబిడ్డ!
పసివారికిపాలు పెద్దలకు తిండి 
అందరికీ విద్య కావాలన్నావు!
ఆర్యసమాజ్ ఆవాజ్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపకుడా!
సైమన్ గోబ్యాక్ అన్నావు
మేధావి రచయిత వకీలు!
లాఠీదెబ్బలకు నెత్తురు ఓడుతూ "నాప్రతి నెత్తురు చుక్క స్వాతంత్ర్య యోధులజననీ!
నాగుండెలమీద పడిన దెబ్బలు
బ్రిటిష్ రాజ్య శవపేటిక మేకులు" అని పంజాబ్ కేసరీ
జూలు విదిలించావు!
లాలా బాల్ పాల్ లో అగ్రజుడవుగ నిలిచావు!
వజ్రోత్సవ వేళ నీకిదే అంజలీ!
కామెంట్‌లు