అందెగత్తెలు ;-కవిత సీటి పల్లి;-కలం స్నేహం
 ఆరు బయట అందగత్తెలు ...
అరుగు మీద పూల సజ్జలు...
అలిగిన మనసులు అలక పాన్పులు...
అర బోసిన ఆ అందం వెన్నెలకే కాంతులు ...
అర నవ్వులు ఎదలో ముసుగు తెరలు వీడని కాటుక కన్నులు ..
ఆకాశం గుంభనంగా అరచేతుల ఆ మోములు ...
ఆకుల పచ్చని తోరణాల కన్నె మగువలు ...
అవనికే అల్లుకున్న ప్రేమ లతలు...
అమ్మ నాన్న కలల ఒడిలో సిరుల పంటలు...
ఆ గల గల గాజుల స్వరాలు మౌన గీతాలు ..
ఆ కొమ్మ కోయిల సరిగమలు మది గంటలో దాచుకున్న వసంతాలు ...
అనురాగం పంచే ప్రతి గడప  వెలుగులు...
ఆ శోభలు కళకళ లాడే కార్తీక దీపాలు...

కామెంట్‌లు