కాలయాపన తగదు...;-బంగారు కల్పగురి-కలంస్నేహం
నీ గురించి గొప్పగా విని
నీ దివ్యరూపం కళ్లారా కని
నీవంటే వెర్రి అభిమానినని
నీవో వ్యక్తిత్వ శిఖరానివని
నీతో ఒక సెల్ఫీ ప్లీజ్ అనాలని...

మనసంతా గిలిగింత స్వరాలై
మాధుర్య పులకరింత సరాగమై
మమతెంతో పెనవేసే స్నేహానికై
మళ్ళీ మళ్ళీ కలలో కళ నీవై
మది గునిసే ఓ మౌన రాగంమై...

గుండెనిండా ఊసుల మోసులై
గుర్తులన్నీ నీతో నిండిన భావాలై 
గుట్టుతనం మోయలేని ఏకాంతనై
గుత్తాధిపత్యం నీకే కట్టబెట్టే కలికినై
గుడిచేసా ఓగుప్పెడంత  స్నేహంకై...

నీకళ్ల చిలిపితనంకి చిన్నారినై వేచి
నీ మూడుముళ్ల బంధానికి ప్రాణమిచ్చి
నీతో జతయ్యను ఏరువాక ప్రణయమిచ్చి 
నీనీడే నీరెండై నను కాచే ఇంద్రధనుస్సని 
నీ నవ్వుంటే తిరణాల్లే ప్రతిపూటని...

జీవం అంతా నిన్నే నింపా
జీరో కానీయక కాలం సాక్షిగా
జోడేడ్ల బండల్లే బతుకు సాగ
జ్యోతినై కాచుకుంటా కడగళ్ళలో 
జీవితమంతా కాపలానే నీ దాసిగా


కామెంట్‌లు