అక్క కుక్క నక్క చెక్క; -పదాలతో దత్తపది;--సాహితీసింధు సరళ గున్నాల

 ఉ*అక్కకు పెళ్ళిచేయజనె నందరు గుంపుగ నొక్కసారిగన్
కుక్కగ వ్యానులోననట కుక్కిన పేనుగ నూపిరాడకన్
నక్కగ,నెత్తుపల్లముల, నాటెను చక్రమునందుముల్లు నో
దిక్కుకు బండివంగనట దెబ్బలు దాకెను చెక్కెచేతులున్
కామెంట్‌లు