తమిళంలో మనుష్యపుత్రన్;--తెలుగులో అనుసృజన ;-జగదీశ్ యామిజాల
తుపాను చిహ్నం
----------------------
తుపాను అంటే
ఏమిటో
నాకూ తెలుసు

ఓ కొవ్వొత్తిని  
కొనుక్కొచ్చాను

ఓ అగ్గిపుల్లను తడవకుండా
జాగర్త చేసి ఉంచాను

ఓ విరిగిన కిటికీ తలుపు
కొక్కాన్ని సరి చేశాను

చెట్లు వాలిపోకుండా
ఓ తాడుతో కట్టాను

తుపాను
తలుపుని తట్టేటప్పుడు
ఎవరో మిత్రులు 
తడుతున్నారంటూ
తెరవకూడదనే కృతనిశ్చయంతో 
ఉన్నాను

అన్ని రకాలుగా
నా దారిలో
సమాయత్తమయ్యాను

ఇది ప్రేమ కాదు
ఒక తేలిక స్నేహమని
నూరో సారి
నాకు నేనే నిరూపించుకున్నాను

తుపాను అంటే
ఏమిటో
నాకూ తెలుసు.

కామెంట్‌లు