కొన్ని నిజాలు ..!కొన్ని అబద్దాలు ..!!వచన పద్యాలు > పొట్లపల్లి శ్రీనివాసరావు.భీమారం ..> హన్మకొండ .
పూలు కొనడం ఏవగింపు మన తిండి తినడం నామోషీ
విటమిన్లు మింగి నాజూగ్గా ఇంపుగా కనిపించడం ఖుషి
అన్నీ అనర్థాల మధ్య అందంగా కనిపించడమే  జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

మలినమైన ఆలోచనలు తప్పక ఆచరించే వాళ్లు
అందాలకు బంధాలేసి చీల్చి కాల్చే మానవ మృగాళ్ళు
చావక దర్ఫంగా బతికుండే సోగ్గాళ్ళదే కదా  జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

కంచే చేను మేస్తే  నమ్మక ద్రోహానికి చిరునామా
తిన్నింటి వాసాలు లెక్కిస్తే అతినమ్మకానికి పరాకాష్ట
ఆబగా తిని బలిసే క్రిమి ఖబ్జా
 నాయకుడైతేనే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

లగ్జరీ విల్లా వుంది లవ్లీ బర్డు వుంది బెంజు కారూ వుంది
పలుకుబడి, ఏలుబడి వుంది రాబడి జోరూవుంది
పరువు బతుకులో కరువైన పలకరింపుల తడి జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

ఏతులు చెప్పు నొక్కడు గొప్పలు పలుకు నొక్కడు
నీతులు బోధించు నొక్కడు  నమ్మ బలుకు నొక్కడు
మెట్టుకు ఓటరును నమ్మించిగెలిచి ముంచుటే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

రోగ నివారణ చికిత్సకు శరీరపుష్టికి ఔషధ శాలలు
సంక్షేమ కార్యక్రమాల  ఖజానా పుష్టికి మధుశాలలు
కర్ఫ్యూ విధించినా ఆదుకునే ఆత్మీయమే నిషా జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం
                              ***

కామెంట్‌లు