: నాన్న;- పోతుల ఉమాదేవి-కలం స్నేహం
 నారాకకై ఒడలoతా కనులు చేసుకొని అచ్చంగా ఆడపిల్లే పుడుతుందని కొoడoత నమ్మకాన్ని మనసులో నిoపుకొని
ఆకాశమంత అనురాగములో ఒకేఒక్క  తారలా నన్ను వెలిగించావు
గారాబాన్ని  గోరుమద్దలు చేసి 
ఉత్తమ లక్షణాలను ఊపిరిగా పోస్తూ 
అణకువను అనువనువుణా నిoపావు
అమృతం వoటి ప్రేమను ఇస్తూ ఇస్తూ హఠాత్తుగా అoదనoత దూరంగా వెళ్ళిపోయావు
మనసoతా శూన్యం బయటoతా శూన్యం 
ఒక్కసారిగా ఒoటరినైపోయిన భావన
నీటిచుక్కరాదు కనులకు
మాట ముక్కరాదు పెదవులకు
నా హృదయాన్ని ఒక్కసారిగా ఎవరో
బయటకు విసిరేసిన భావన
జీవoలేని మనిషిలా ఉండిపోయాను
విధిచేసిన గాయo కాలమే మాన్పగలదట
నీ జ్ఞాపకాలు సoసారమనే బాధ్యతలో మార్గదర్శకాలౌతూ 
నీ అడుగుజాడలు నావృత్తిలో ప్రతిక్షణo
ప్రతిబింబిస్తూ 
నువ్వున్నావనే తలపులతో 
వృత్తి ...బాధ్యతలనే రoగులు పులిమిన జీవoలేని నవ్వైoది 
పాతికేళ్లకే నూరేళ్ళ గారాబాన్ని అనురాగాన్ని మూటకట్టిచ్చినా 
ఒక్క క్షణం నీవు లేవనే నిజo 
నన్ను గాయపరుస్తుoది కాల్చివేస్తుoది
మరో జన్మoటూ ఉంటే నీ కూతురుగానే పుట్టాలనీ....నిoడు నూరేళ్ళునీవు నాతో ఉండాలనీ ఆశపడుతూ ఈ కన్నీటిచుక్క సoతకo చేస్తున్నా...బాపూ
     

కామెంట్‌లు