పరీక్ష! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒక ధనవంతుడు ఆపల్లె కి దగ్గరగా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు.ఆపల్లెవారందరికీ తనకుతోచిన సాయంచేసి వారి మంచి చెడ్డలు అడిగి తెలుసుకుని కావలసిన సాయంఅందించేవాడు.వారి ఇళ్ళదగ్గర చెట్లునాటించాడు.పండగపబ్బాలకి భోజనాలు ఏర్పాటు చేసి తలాఒక మొక్కబహుమతిగా ఇచ్చి తను ప్రతివారం ఆచెట్టు సంరక్షణ  ఎవరు ఎలాచేస్తున్నారో చూస్తాఅని చెప్పాడు.చెట్టుపోషణ చేసేవారికి భోజనం ఒక రోజు పెట్టి కొంత డబ్బు ఇచ్చే వాడు.అతనికి ఓదివ్యాంగురాలైన కూతురు ఉంది. ఆమె చక్రాల కుర్చీలో కూర్చుని తోడుగా నౌకరుతో కలిసి బైట తిరిగేది.ఇక ఆఊరివారిలో అసంతృప్తి పెరుగుతోంది. "ఈపిసనారి మొక్కలను బహుమతి గాఇచ్చి వాటిని పెంచమంటున్నాడు.వారికే వారానికి ఓసారి భోజనం పెడతాడు. దీని వల్ల మనకేం లాభం?"అని మొక్కలు తీసుకోటం మానేశారు. ఆరోజు  ధనవంతుడు తన ఇంటిముందు అందరూ నడిచే దారిలో పెద్ద బండరాయి పెట్టి దాన్ని గమనిస్తూఉండేవాడు. ఆవిషయం కూతురు కి కూడా తెలీదు.ఆరోజు ఒక రైతు ఎద్దులను తోలుకెళ్లుతూ"ఛ ఛ !ఎవడుపెట్టాడు ఇంతబండరాయి?"అని తిట్టుకుంటూవెనకకి మరలి వేరేదారిగుండా పొలంచేరాడు.
ఇక ఆబాటపై నడిచే వారంతా ఆబండరాయిని దాన్ని  అడ్డుగా పెట్టిన వారి ని తిట్టుకుంటూ పక్కకి తిరిగి నడుస్తున్నారేకానీ ఒక్కరుకూడాదాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. ఒక యువకుడు  మేకలమందతో పాటు తన అంధుడైన తండ్రిని జాగ్రత్తగా  నడిపించుకుంటూ ఆరాతిబండను చూశాడు."నాన్నా!నీవు  చెట్టుకింద కూచో.మనం ఈఊరికి కొత్త. ఈబండను పక్కకి జరుపుతాను.ఆపెద్ద  భవంతి బైట  మనం ఈరాత్రికి ఉందాం."అని తనే నెట్టేప్రయత్నం చేశాడు.ఆశ్చర్యం! ఆబండ అతితేలికగా కదిలింది.లోపల అంతా బోలు!ఇదంతా ధనికుడు అతని కూతురు చూస్తూ నే  ఉన్నారు. తన తండ్రిని చేయిపట్టి నడిపిస్తూ  ఆభవంతి గేటుముందు ఆగాడు. "అయ్యా!మేము పొరుగూరి నించి  పట్నం వెళ్లాలని బైలుదేరాము.చీకటి పడుతోంది కదా!ఈరాత్రికి  మీవాకిలి ముందు  నాన్న ని పడుకోబెడతాను.నేను  కొన్ని మేకలను సంతలో అమ్మా లని బైలుదేరాను.నాన్న ను చూసేవారు లేరని నావెంట తీసుకుని వెళ్లుతున్నాను".ధనికుడు  సరే నన్నాడు.తెల్లారుతూనే యువకుడు  మేకలతో పట్నం బైలుదేరాడు. అంధుడైన తండ్రిని ధనికుని దగ్గర ఉంచాడు.మాటలమధ్య ధనికుడు  ఆఅంధుడు చిన్నప్పటి బాల్య స్నేహితులు. ధనికుడి తండ్రి భార్య పిల్లాడితో ఆరోజుల్లో రంగూన్ వెళ్లి  డబ్బు సంపాదించి తిరిగి వచ్చాడు ఇరవై ఏళ్ళ తర్వాత. గనిలో పనిచేస్తున్న యువకుని తండ్రి ప్ర మాదవశాత్తు చూపుపోయి అంధుడైనాడు.
ఆఇరువురు మిత్రుల సంబరం అంబరాన్ని తాకింది. రెండు రోజులతర్వాత రాము మేకలన్నిటినీ అమ్మేసి తండ్రిని తీసుకుని వెళ్లుదామని వచ్చాడు."నాన్నా!పట్నం బతుకు అధ్వానంగా ఉంది. పల్లెలోనే మన ఎకరంపొలం సాగుచేస్తా.తేనె టీగలపెంపకం చేపడతా"అంటున్న అతనితో"బాబూ!మీరు ఎక్కడకీ పోవద్దు.మీనాన్న నేను బాల్య మిత్రులం."అనటంతో రాము కూడా తలవొగ్గాడు. ఆరునెలలు గడిచాయి.రాముతో తన కూతురి పెళ్ళి చేసి  ఆరోజు చెప్పా డు" నాకూతురి భవిష్యత్తు ఆలోచన లో ఆబండ రాయిని నేనే దారికి అడ్డంగా పెట్టించాను.ఆపరీక్షలో నీవు నెగ్గావు.అంధుడైన తండ్రి కైనీవు చేస్తున్న సేవ నన్ను ముగ్ధుడ్ని చేసింది. నడవలేని నాకూతురి జీవితం  నీతో ముడిపడితే భద్రత ఉంటుంది "అన్న మామగారి మాటలకు చిరునవ్వే రాము ఇచ్చిన  జవాబు!
కామెంట్‌లు