బావయ్య (బాలగేయం);-:- డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్.
 నావనడిపే బావయ్యా
జావగారి పోవద్దయ్యా
చేవకలిగీ ఉండాలయ్యా
త్రోవమరిచీ పోవద్దయ్యా
!!నావ!!
రావిచెట్టూ నీడాలోనా
తావిమోపరి హాయిగ వీచగ
దీవియ వెలుగున మనమూ ఆడి
బావినీరు తాగూదామా
!!నావ!!
రాకరాక బావ వచ్చే
పోకపూల పరికిణి తెచ్చే
తోకలేని మా బావయ్యా
రూకలెన్నో సంపాదించే
!!నావ!!
కాకితోనీ కేకికి స్నేహం
కేకితోనీ మాకూ నేస్తం
తాకితేనే ముడుచుకుపోవు
సోకిన నీడకు సిగ్గుపడు
!!నావ!!
(తావిమోపరి=గాలి;దీవియ=దీపము;కేకి=నెమలి)

కామెంట్‌లు