ఆ క్షణం...;-తమిళ మూలం : మనుష్యపుత్రన్;-- యామిజాల జగదీశ్
రెప్పపాటు 
కాలపు చీకటే
అది!

అని తెలుసు
అయినప్పటికీ,

ఎంత కన్నీరూ
ఎంత భయమూ
ఎంత స్వీయనిందా

ఒక క్షణమే అయినా
పూర్తిగా కప్పేసింది
విడివడటం తెలీలేదు

ఇప్పుడు
మనం మాట్లాడుకుంటున్నట్టుగా
లేనేలేదు
అప్పుడది!!
--------------------------------------------


కామెంట్‌లు