ఆత్మీయ గూడు.-అనూరాధ మేరుగు-కలంస్నేహం
కృతక యాంత్రిక జీవన నగరం
కాలుష్య వాతావరణపు కారాగారం....
మది ఊహాశక్తికి ప్రతిబింబం
 పరిసరాల ఆసక్తికి ప్రతికూలం....
నీలాల నింగి సుడిగుండాల సంద్రమై
 మేఘాల మధురిమనీ, అంతరంగ ఆక్రోశాన్ని పట్టించుకునే ప్రబుద్ధుడు కరువై....

సుందర నందన వనాలు ప్రకృతి సోయగాలు...
సింగిడి వన్నెల సింగారాలు పల్లె ప్రదీప్తులు...
అమ్మ వాత్సల్యము నాన్న మమకారం
సోదరుల స్నేహభావం అక్కచెల్లెళ్ల ఆత్మీయతానురాగం.....
పసిడి కాంతుల పసితనం
చిద్విలాసపు చిలిపితనం....
పరస్పర వైషమ్యాలు రాగద్వేషాలకతీతమైన మేలిమి మౌఖ్తిక మణిహారం గ్రామం...

వయ్యారాల వాలుజడ మొగ్గలరైక పూలజడ... 
కుదురుగ కుంకుమదిద్దిన నొసటి ధనువు కాటుక కళ్ళు ఆలంబనై...
తరువు త్యాగధనపు మేరువై నీడనిచ్చే ఇంటిముచ్చటై...
ఆహ్వానం పలికే .....

సాకులతోసాగదీయక సంకల్పంతో సాగితే....
భూమిలోని రాయే సానపెడితే వజ్రమవదా...
శ్రద్ధ పెడితే శ్రమ సౌందర్యశిల్పం చెక్కబడదా...
చేయి చేయి కలిస్తే చారిత్రక ప్రభాతాల సంఘీభావోద్యమ పరిపూర్ణోదయము కాదా....


కామెంట్‌లు
అనూరాధ మేరుగు చెప్పారు…
ధన్యవాదాలు 🙏 మొలక అంతర్జాల పత్రిక యాజమాన్యానికి...
కలంస్నేహ అడ్మిన్ గారికి.... మరియు నిర్వాహకులకు.... కృతజ్ఞతాస్తుతులు 🙏🙏🙏...