"సంగీతం"; -ఎం బిందుమాధవి.
 వనజ స్టూడెంట్ ఎడ్వైజర్ గా స్కూల్ వార్షికోత్సవాల ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నది. ఆసక్తి గల విద్యార్ధుల పేర్లునమోదు చేసుకోవటంలో రోజంతా ఒకటే హడావుడి! 


రజని తను సంప్రదాయ కర్ణాటక సంగీత కచేరి చెయ్యదల్చుకున్నట్లు చెప్పి పేరు నమోదు చేయించుకుని వెళ్ళింది. "ఎవ్వరికీ చెప్పకండి టీచర్. నేనే ముందు చెప్పాను కదా! ఇక ఇలాంటి కార్యక్రమానికి వేరే వారి పేర్లు వ్రాసుకోవద్దు" అనిచెప్పి వెళ్ళింది. "పక్క వాయిద్యాల ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి. మంచి మైక్ లు మన స్కూల్ లో ఉన్నాయిలే" అన్నదివనజ. 


నృత్యాలు, నాటకాలు, నాటికలు, ఏక పాత్రాభినయాలు, హాస్య సంభాషణలు, ఆర్కెస్ట్రాలు....విద్యార్ధులు ఒకరికితెలియకుండా ఒకరు, తమ అంశమే ప్రత్యేక ఆకర్షణ కావాలని రిహార్సల్స్ తో బిజీ గా ఉన్నారు. 


********


"అవ్వా..రేపటి నించి స్కూల్ లేదు. లాక్డౌన్ ట, మమ్మల్ని స్కూల్ కి రావద్దన్నారు. మళ్ళీ నిన్నెప్పుడు చూస్తామో" అన్నపిల్లలతో  "ఔ బాబూ పదేళ్ళ సంది ఈ ఇస్కూలు ముంగట్నే పండ్లు అమ్ముతూ బతుకుతున్న.. మీ అందరితో మాట్లాడుతూనేనే సదువుకున్నట్లు అనుకుంటన్నా! ఇప్పుడు మాబోటసుంటోళ్ళకి  సిటీల్లో బతుకుడు కష్టమే! ఈ మాయదారి జబ్బుపేరు చెప్పి, అదేందో....ఇళ్ళల్లోనే ఉండలంట గద. బయటికి పోకూడదంట. మా బోటి చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళుఎట్ల బతుకుతరయ్యా? ఏదో ఒకటి చేసి కడుపుకింత తినాలె గదయ్యా! అందుకే  మా వూరికి పోతున్నం! ఎల్లంగనేపనులు దొరుకతయ్యొ లేదొ తెల్వదు గదా! మనసున్న మారాజులు మీ అసుంటోళ్ళే  ఏదొకటి సెయ్యాల!" అని స్కూల్ముందు జామ కాయలు, యాపిల్ పండ్లు అమ్మే   యాదవ్వ వేషంలో హరిణి చేసిన "ఏక పాత్రాభినయం" అందరినిఆకట్టుకుంది. 


"మేరే దేశ్ వాసియో.. ఏ కరోనా ఆజ్ కా సంకట్ హై. అబ్ హం విస్తార్ సే సోచ్ కర్ ఏ సంకట్ సే ఆత్మ నిర్భర్ సే కాం కర్ కేఆగే బఢ్నా హై. ఏ హమారా సప్నా నహీ, మగర్ ఏక్ బడా జిమ్మెదారీ భి హై. ఏ బడీ ఆపదా హంకో ఏక్ సంకేత్ దియా హై. సందేశ్ దియా హై. ఏక్ అవసర్ కో లేకే ఆయా. షురు మే హం మాస్క్స్ ఔర్ పిపియి కిట్స్ నహీ బన్ తే థే. అబ్ దేఖో ఎక్దిన్ కో ఏక్ లాఖ్, దో లాఖ్ బన్ రహే హై" అంటూ  "నిర్భర్ భారత్" మీద మోదీ గారి ప్రసంగం మీద వంశీ మోనో యాక్షన్అందరికీ నచ్చింది. 


"ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ..తూ ఆజానా, (సరిలేరు నీకెవ్వరు సినిమాలో) పాట, "బంటు గానికి ట్వెంటీ టూ బస్తిలోమస్త్ కటౌటు" (అల వైకుంఠపురం లో పాట), "అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడు" (జెర్సీ లో పాట), "ఒక విత్తనంమొలకెత్తడం సరికొత్తగా" (గోల్కొండ హై స్కూల్ లో పాట) ఆర్కెస్ట్రా స్కూల్ పిల్లలందరిని హుషారెక్కించింది. 


"రజని కర్ణాటక సంగీత కచేరి కొద్ది సేపటిలో మనని అలరించనుంది" అని వనజ మేడం ప్రకటించగానే..."అబ్భా ఇదెవరికిఅర్ధమవుతుంది" అని ఒకరు, "ఇలాంటివి ఒప్పుకోవలసింది కాదు వనజ మేడం" అని ఒకరు, "పాడే వాళ్ళు కళ్ళుమూసుకుని తాళం వేస్తూ తన్మయత్వం లో ఉంటారు, కానీ మనకి బోర్" అని ఒకరు గట్టిగానే వ్యాఖ్యలు మొదలు పెట్టారు. 


ముందుగా ఘంటసాల గారు పాడిన "హంస ధ్వని రాగం" లో "వాతాపి గణపతిం భజే" తో కచేరీ మొదలు పెట్టి, విశ్వనాధ్గారి సినిమాల ద్వారా అందరికీ తెలిసిన "మరుగేలరా ఓ రాఘవా" జయంతశ్రీ రాగంలోను,  "సామజ వర గమన" హిందోళం లోను, "బౌళి"  రాగంలో "తందనానా ఆహి", "కురంజి" రాగం లో "ముద్దుగారే యశోద" అన్నమాచార్య కీర్తనలుపాడి చివర అమృత వర్షిణి రాగంలో "ఆనతి నీయరా" అనే సినిమా పాటతో ముగించింది. 


అంతకు ముందు గోల చేసి కామెంట్స్ చేసిన విద్యార్ధులంతా, కచేరి సాగుతున్నంత సేపు చీమ చిటుక్కుమన్నావినిపించేటంత నిశ్శబ్దంగా కూర్చున్నారు. సభికులు రజని గాన మాధుర్యానికి, పాడిన విధానానికి నిలబడి పదినిముషాలు ఆపకుండా చప్పట్లు కొట్టారు. 


*******


వార్షికోత్సవాల మరునాడు సెలవు ఇచ్చారు. ఆ మరునాడు స్కూల్ కి వచ్చిన పిల్లలు క్లాసులో టీచర్ వచ్చేవరకు, ఆముందు రోజు జరిగిన కార్యక్రమాల గురించి గోల గోలగా మాట్లాడుకుంటున్నారు. 


బయాలజీ టీచర్ శ్రావణి క్లాసులోకి వచ్చి, "మీరు మాటలు ఆపి సిద్ధమైతే పాఠం మొదలు పెడదాం"అన్నారు. "టీచర్మీరు పోయిన క్లాసులో థెరపీ ద్వారా మనకి కావాలనుకున్న పద్ధతిలో శిశు జననం చేయించచ్చు అని చెప్పారు కదా! అలాంటి ఒక ప్రయోగం బెనారస్ విశ్వవిద్యాలయం లో చేస్తున్నారని కూడా చెప్పారు కదా! మొన్న మన ఫంక్షన్ రోజు 'రజని ' చేసిన కచేరీకి మంత్ర ముగ్ధులయినట్లు అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టటం చూశాము. సంగీతం అందరికి పాడటంరాకపోయినా, ఆ రాగాల్లోని మాధుర్యం మనసుని అలరిస్తుందని, వినే వారిని వశపరుచుకుంటుందని, అలౌకికప్రపంచంలోకి తీసుకెళుతుందని... అప్పుడు మాకు అర్ధమయింది."


"ఈ విషయం గురించి చెప్పండి టీచర్" అన్నారు పిల్లలందరు. 


"సంగీతం మనకి ఉల్లసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుందని సినిమా పాటలు వినే మనందరికీ తెలుసు. అది ఎందుకంటేమనకి సాహిత్యం అర్ధం అయినా కాక పోయినా ట్యూన్ ఆకట్టుకునేలా ఒక లయతో ఉంటే మనకి తెలియకుండానేతలలూపుతాం అవునా! మనందరం సినిమా పాటలు ఇష్టంగా వింటాం, అవి మన నిత్య జీవితంలో ఒక ముఖ్య భాగం."


"ఒక రచనకి బాణీ  కట్టేటప్పుడు ఆ పాట సినిమాలో వచ్చే సన్ని వేశం, సమయం (ఉదయం/సాయంత్రం), సందర్భం, నటించే వారి భావోద్వేగాలు దృష్టిలో పెట్టుకుంటారు. అంటే కోపం, ప్రేమ, జాలి, కరుణ, విషాదం, హాస్యం, భయం, శృంగారం..ఇలా అన్నమాట!"


"దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాగం..అందులో వాడే స్వరాలని బట్టి, ఆ స్వరాల స్థాయి (హెచ్చు స్థాయి, మంద్ర స్థాయి) ని బట్టిఒక్కొక్క భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుంది అని తెలుస్తున్నది. కొన్ని రాగాలు కొన్ని జబ్బులని తగ్గించటానికి కూడాఉపయోగించచ్చు అని సంగీతజ్ఞులు ప్రయోగాత్మకంగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిరూపణ కాకపోయినాసంగీతం మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది అనేది సత్యం!"


"టీచర్ "అభిమన్యు" ప్రయోగంలో ప్రశాంతతని ఇస్తూ సానుకూల దృక్పధాన్ని పెంచటానికి మధురమైన సంగీతం, వేదపఠనం వినిపిస్తారని, యోగాభ్యాసం చేయిస్తారని చెప్పారు కదా! అలాగే వారి ఆనువంశిక జన్యువుల్లో ఏవైనా ప్రస్ఫుటంగాకనిపించే రోగాలు ఉంటే, అవి రాకుండా నిరోధించేటందుకు మీకు తెలిసిన రాగాలేమైనా ఉన్నాయా" అనడిగాడువాసుదేవ్. 


"కొన్ని రాగాలు కొన్ని పరిస్థితుల్లో ఆలపిస్తే ఫలితాలు కనిపించాయి అని అనూచానంగా పెద్దలు అంటారు. అలాంటి ఒకఅనుభవం..అక్బర్ చక్రవర్తి కొలువులో పెద్ద సంగీత విద్వాంసుడు గా పేరుపొందిన "తాన్ సేన్"..పగలంతా రాచరికపాలనతో అలిసిపోయిన చక్రవర్తికి మానసికోల్లాసానికి, పరిపాలనా ఒత్తిడి నించి ఉపశమనం పొందటానికి "దర్బారికానడ", "దర్బారి", ఆలపించేవాడుట. తాన్ సేన్ "అమృత వర్షిణి" రాగం ఆలపించి వర్షం కురిపించాడని కూడాచెబుతారు."


"ఒక జీవి మానసిక స్థితి మీద, వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని పెద్దలంటారు. ఆ విషయాన్ని ఇటీవల మానసికతత్వవేత్తలు నిరూపించారు." 


"ఈ విషయం చెట్లకి, జంతువులకి కూడా వర్తిస్తుంది."


"ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన సంగీతం వినిపించినందువల్ల ఆవులు ఎక్కువ పాలు ఇచ్చాయని, ఆ పాలల్లో పోషకాలుకూడా ఎక్కువగా ఉన్నాయని ప్రయోగ పూర్వకంగా నిరూపించారని మనం వార్తా పత్రికల్లో చదివాం, గుర్తుందా?"


"అలాగే "తోడి, వసంత"రాగాల ఆలాపన రక్తపోటు తగ్గించగలదని


"శుద్ధ ధన్యాసి", ఆహ్లాదాన్ని కలిగిస్తూ నరాల సంబంధ వ్యాధులని తగ్గిస్తుందని,


"కాపి", "సామ", "నీలాంబరి", "సారమతి" రాగాలు  అలజడిని తగ్గించి సుఖ నిద్రనిస్తాయని, 


"గానమూర్తి" "బాగెశ్రి" రాగాలు చక్కెర వ్యాధిని (డయాబెటిస్) తగ్గించటంలో విశేషంగా పని చేస్తాయని,


 "హంస ధ్వని" రాగాలాపన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని,


"ఆనంద భైరవి" "రంజని" రాగాలు మూత్ర పిండ వ్యాధికి మంచి ఉపశమనాలని, 


"మాయామాళవగౌళ", శరీరంలో కాలుష్యాలని తగ్గిస్తుందని, ఉదయం ప్రకృతితో మమేకమయి తన్మయత్వంతో ఆలపిస్తేస్వరపేటిక శక్తిని పెంచుతుందని, 


"మధ్యమావతి" నరాల సంబంధమైన రోగాలు..ముఖ్యంగా పక్షవాతం వచ్చిన వారికి నొప్పి నించి ఉపశమనం ఇస్తుందని 


 ..ఇలాగే ఇంకా చాలా రాగాలు గాయకులు, వాయిద్యకారులు మనస్ఫూర్తిగా తన్మయమయి ఆలపిస్తే చాలా ప్రయోజనాలుఉంటాయని చెబుతారు." 


"ఈ విషయాలని ప్రయోగ శాలల్లో నిరూపించటం కష్టంతోకూడుకున్న పనే అయినా ఇవన్నీ ఆలపించేవారి స్వర జ్ఞానం, రాగం పట్ల వారికున్న అవగాహన, ఏకాగ్రత, తన్మయత్వం, మనోధర్మం 


ఆలకించేవారి నమ్మకం, తన్మయ స్థితి, మాధుర్యానికి స్పందించే శక్తిపై ఆధారపడి ఉండే విషయాలు. 


భౌతిక విషయాలని, వస్తువులని  ప్రయోగ నాళికలో వేసి పరీక్షించినట్లు మానసిక విషయాలని పరీక్షించటం, నిరూపించటం కష్టం కావచ్చు. కానీ భావోద్వేగాలకి ఒక రూపం ఉన్నది, ఒక వ్యక్తీకరణ ఉన్నది, ఒక స్పందన ఉన్నది అనిమనందరం ఒప్పుకుంటాం. అలాగే అవి ఒక రాగం ద్వారా ఒక వాయిద్య పరికరం ద్వారా తెలియచేస్తాం అంటే, అదినిరూపణకి అతీతం కాదు అని చెప్పలేము అవునా" 


"రోగాలు నయం చెయ్యటానికి, సంగీతాన్ని ఒక "థెరపీ" లాగా ఉపయోగించచ్చు అనే వాదన ఈ మధ్య బలంపుంజుకుంటున్నది. అలాంటి ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఫలితాలు ఇంకా నిరూపించబడలేదు" అన్నారుశ్రావణి టీచర్.


"మీరు చెప్పిన విషయాలు పూర్తిగా అర్ధం కాకపోయినా, సంగీతం పట్ల ఇప్పటివరకు మాకు తెలియని ఎన్నో విషయాలనిమా స్థాయికి తీసుకొచ్చి అర్ధమయ్యేలా చెప్పి మాకు సంప్రదాయ సంగీతం పట్ల ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టారు టీచర్" అన్నారు పిల్లలు ముక్త కంఠంతో! 


"ఇవన్నీ ప్రత్యక్షంగా మీ సబ్జక్ట్ పరిధిలోకి రాకపోయినా, పెద్ద క్లాసుల్లోకి వచ్చేసరికి మీ సబ్జక్ట్ అర్ధం చేసుకోవటానికి ఇవన్నీఉపయోగపడతాయి. వచ్చేవారం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాము" అని టీచర్ బయటికెళ్ళిపోయారు. 

కామెంట్‌లు