తరుణోపాయం;-కమల ముక్కు;-కలం స్నేహం
పదేళ్ల తర్వాత వచ్చా ఊరు 
చూశా ఓ వింత దృశ్యం
సైకిలు స్టాండులో

సైకిలు టైరుకీ చెప్పులు కీ కలిపి
వేశాడెవరో తాళం 
నవ్వాపుకోలేక అడిగా పక్కనోడిని
చెప్పాడా వ్యక్తి 
సైకిలు చెప్పు వెనుక రహస్యం


వెంగళాయి వాడి పేరంట 
సైకిలు తో పోతాడు పనికి రోజంట 
పనికి పోయినింటికాడ 
చెప్పులిడిసి పెట్టి పని పూర్తి చేసొచ్చేసరికి 
చెప్పులు మాయమయ్యేవంట


బడికీ గుడికీ
చుట్టాలింటికీ బంధువులింటికీ 
ఎక్కడికీ పోయినా 
లోపలకెళ్లి వచ్చేసరికి 
చెప్పులు మాయం
పక్కనెన్ని కొత్త కొత్త రకాల చెప్పులున్నా 
అన్నీ వదిలీ వెంగళాయి చెప్పులే 
దాచే దొంగలెవరో కానీ

ఎంతో ఇష్టపడి కొనుక్కునే 
చెప్పులు పోయే సరికి
ఏమీ చేయలేని వెంగళాయి కి 
తట్టిన తరుణోపాయం 
సైకిల్ చెప్పు తాళం

అప్పటినుంచీ లేదతనికి 
ఏ చీకూ చింతా 
మాయం కాలేదు 
అతని చెప్పులింక


కామెంట్‌లు